Trump Warns Hamas: హమాస్‌కు ట్రంప్ మరో వార్నింగ్.. ఈ సారి చాలా సీరియస్‌గా..
ABN, Publish Date - Oct 21 , 2025 | 09:32 PM
ట్రంప్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘హమాస్ గాజాలోని ప్రజల్ని చంపుకుంటూ పోతే సహించం. హమాస్‌ను అంతం చేయటం తప్పితే మాకు వేరే దారి లేదు’ అని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌కు మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గాజాపై ఈగ వాలినా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని హమాస్‌ను హెచ్చరించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అంతం చేస్తామని స్పష్టం చేశారు. ఇంతకీ సంగతేంటంటే.. ట్రంప్ చొరవ కారణంగా ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య యుద్ధం ఆగిన సంగతి తెలిసిందే. అయితే, గాజా పౌరులపై దాడి చేయడానికి హమాస్ ప్లాన్ చేసిందని విశ్వసనీయ వర్గాల ద్వారా అమెరికాకు తెలిసింది.
దీంతో ట్రంప్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘హమాస్ గాజాలోని ప్రజల్ని చంపుకుంటూ పోతే సహించం. హమాస్‌ను అంతం చేయటం తప్పితే మాకు వేరే దారి లేదు’ అని అన్నారు. ఇప్పుడు మరోసారి హమాస్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం తన సొంత సోషల్ మీడియా ది ట్రూత్‌లో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘
మిడిల్ ఈస్ట్ దేశాలపై ఇంత ప్రేమ, ఆప్యాయతలను వెయ్యి ఏళ్లలో ఎప్పుడూ చూడలేదు. అది చాలా అందమైనది. దాన్ని కాపాడుకోవాలి. నేను ఇజ్రాయెల్‌తో పాటు మిగిలిన దేశాలకు ఇదే చెప్పాను. హమాస్ మంచి పనులే చేస్తారని నాకు నమ్మకం ఉంది. మాతో చేసుకున్న ఒప్పందానికి వ్యతిరేకంగా హమాస్ చెడ్డ పనులు చేసుకుంటే పోతే.... అంతం చాలా త్వరగా, భీకరంగా, దారుణంగా ఉంటుంది’ అని అన్నారు. ట్రంప్ వార్నింగ్‌పై హమాస్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.
ఇవి కూడా చదవండి
సీఎం నియోజకవర్గం నుంచి రసవత్తర పోటీ
విధ్వంసం సృష్టించిన సౌతాఫ్రికా.. పాక్ ముందు భారీ లక్ష్యం
Updated Date - Oct 21 , 2025 | 09:41 PM