SA VS PAK: విధ్వంసం సృష్టించిన సౌతాఫ్రికా.. పాక్ ముందు భారీ లక్ష్యం
ABN , Publish Date - Oct 21 , 2025 | 08:54 PM
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా ఇవాళ(సోమవారం) పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 312 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్ ముందు ఉంచింది.
మహిళల వన్డే ప్రపంచకప్2025(World Cup 2025)లో భాగంగా ఇవాళ(సోమవారం) పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా(South Africa Women) బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 312 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్(Pakistan) ముందు ఉంచింది. ప్రోటీస్ కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (90), సూన్ లస్ (68 నాటౌట్), మారిజన్ కాప్ (67 నాటౌట్), నదినే డి క్లెర్క్ (41) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత 40 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది.
చివరి ఓవర్లలో నదినే డి క్లెర్క్ పూనకం వచ్చినట్లుగా బ్యాటింగ్ లో విధ్వంసం సృష్టించింది. 38వ ఓవర్‌లో 2 సిక్సర్లు, 39వ ఓవర్‌లో 3 సిక్సర్లు, ఓ ఫోర్ బాదింది. 40వ ఓవర్‌లో బౌండరీ కొట్టిన తర్వాత సదియా ఇక్భాల్ బౌలింగ్ లో ఔటైంది. చివరి ఓవర్‌లో సౌతాఫ్రికా(South Africa Women) 3 వికెట్లు కోల్పోయినప్పటికీ భారీ స్కోర్ చేయగలిగింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో ముగ్గురు (తజ్మిన్ బ్రిట్జ్, కరాబో మెసో, మ్లాబా) డకౌట్లైనా ఇంత స్కోర్ రావడం విశేషం. పాక్ బౌలర్లలో నష్రా సంధు, సదియా ఇక్బాల్ తలో 3 వికెట్లు తీశారు. కెప్టెన్ ఫాతిమా సనా ఓ వికెట్ పడగొట్టింది. మొత్తంగా పాకిస్థాన్(Pakistan) ముందు సౌతాఫ్రికా భారీ కాకుండా అతి భారీ లక్ష్యాన్ని ఉంచింది.
ప్రస్తుత ప్రపంచకప్ 2025(World Cup 2025)లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు కూడా ఇప్పటికే సెమీస్‌కు చేరుకున్నాయి. నాలుగో బెర్త్ కోసం భారత్(India), న్యూజిలాండ్ పోటీపడుతున్నాయి. అక్టోబర్ 23న ఇరు జట్ల మధ్య జరుగబోయే మ్యాచ్‌తో నాలుగో సెమీస్ బెర్త్ ఖరారవుతుంది. ఆడిన 5 మ్యాచ్‌ల్లో మూడు ఓడిన పాక్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ
అసలు విషయం చెప్పేసిన సీఎం సిద్దరామయ్య.. అదేంటో తెలిస్తే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి