YSRCP Ex MLA Venkate Gouda: పోలీసులపై రెచ్చిపోయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. తీవ్రంగా దూషిస్తూ..
ABN , Publish Date - Oct 21 , 2025 | 08:04 PM
మాజీ ఎమ్మెల్యే వెంకటె గౌడ, ఆయన అనుచరులు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ పోలీసులపై రెచ్చిపోయారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటె గౌడ, ఆయన అనుచరులు రెచ్చిపోయి ప్రవర్తించారు. పోలీసులతో గొడవకు దిగారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. పలమనేరులో ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు అంటూ మాజీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు వాటిని తొలగించే ప్రయత్నాలు చేశారు. నిర్మాణాలు చేపడుతున్న వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది. వివాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
గొడవను ఆపే ప్రయత్నం చేశారు. అయితే, మాజీ ఎమ్మెల్యే వెంకటె గౌడ, ఆయన అనుచరులు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ పోలీసులపై రెచ్చిపోయారు. నిర్మాణాలు చేపడుతున్న వ్యక్తి .. ‘నిర్మాణం చేపడుతున్న స్థలం ప్రభుత్వ స్థలం కాదు. మాకు ఎప్పటి నుంచో పట్టా ఉంది. ఇదివరకే ఈ వివాదానికి సంబంధించి కోర్టులో స్టే కూడా నడుస్తోంది’ అని ఎంత చెబుతున్నా..
అతడి మాటలు మాజీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు పట్టించుకోలేదు. దౌర్జన్యానికి దిగారు. నిర్మించిన గోడను కూల్చే ప్రయత్నం చేశారు. నిర్మాణదారుడు ప్రస్తుత ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి కావడంతో వివాదం రాజకీయ రంగు పులుముకుంది. మాజీ ఎమ్మెల్యే వెంకటె గౌడ పోలీసులతో ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది.
ఇవి కూడా చదవండి
ప్రపంచమే అదిరేలా డెబ్యూ: 10.5 కేజీల బంగారు డ్రెస్, ధర రూ.9.5 కోట్లు!
ఈ పండుగ సీజన్‌లో పతాకస్థాయికి వాణిజ్యం.. చరిత్రలో మొదటిసారి..