Diwali Sales All Time High: ఈ పండుగ సీజన్‌లో పతాకస్థాయికి వాణిజ్యం.. చరిత్రలో మొదటిసారి..
ABN , Publish Date - Oct 21 , 2025 | 06:56 PM
ఈ సారి పండుగ సీజన్‌లో రిటైల్ వాణిజ్యం పతాకస్థాయికి చేరుకుంది. ఏకంగా రూ.6.05 లక్షల కోట్ల మేర వస్తుసేవల అమ్మకాలు జరిగాయని ఇండస్ట్రీ వర్గాలు తాజాగా తెలిపాయి. ఇదో మైలురాయి అని పేర్కొన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ఈ పండుగ సీజన్‌లో వస్తుసేవల విక్రయాలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దీపావళి నాటికి ఏకంగా 6.05 లక్షల కోట్ల మేర వ్యాపారం జరిగింది. పండుగ సీజన్‌లో ఈ స్థాయిలో టర్నోవర్ నమోదు కావడం ఇదే తొలిసారని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి (Diwali sales 2025 India).
గతేడాది పండుగ సీజన్‌తో పోలిస్తే ఈసారి అమ్మకాలు ఏకంగా 25 శాతం పెరిగాయి. కన్జ్యూమర్ డిమాండ్ ప్రోత్సాహకరంగా ఉండటం, జీఎస్టీ సంస్కరణల వల్ల ఈసారి రిటైల్ రంగంలో వ్యాపారం పీక్స్‌కు చేరిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఓ ప్రకటనలో తెలిపింది (6.05 lakh crore festival sales).
పలు వస్తుసేవల జీఎస్టీ పన్ను రేట్లు తగ్గడంతో కొనుగోళ్లు పెరిగినట్టు సీఏఐటీ జరిపిన ఓ సర్వేలో తేలింది. జీఎస్టీ సంస్కరణల వల్ల ఆహార ఉత్పత్తులు, ఫుట్‌వేర్, హోమ్ డెకరేషన్ వస్తువులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఇలా అన్నీ వస్తువుల రేట్లు తగ్గిన విషయం తెలిసిందే. అమ్మకాలు పెరగడానికి కారణం జీఎస్టీ సంస్కరణలని సర్వేలో పాల్గొన్న దాదాపు 75 శాతం మంది వ్యాపారులు తెలిపారు. సాధారణ కిరాణా స్టోర్లలో అమ్మకాలు ఏకంగా 85 శాతం మేర పెరిగినట్టు కూడా ఈ సర్వేలో తేలింది. కేవలం నగరాల్లోనే కాకుండా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ప్రజలు కొనుగోళ్లు పెంచారు. దీంతో, మొత్తం టర్నోవర్‌లో గ్రామీణ ప్రాంతాల వాటా 28 శాతానికి చేరుకుంది.
వ్యాపార వృద్ధి కారణంగా ఈ సీజన్‌లో సుమారు 50 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి దక్కిందని సీఏఐటీ తెలిపింది. లాజిస్టిక్స్, ట్రాన్స్‌పోర్టు, ప్యాకేజింగ్, డెలివరీ రంగాల్లో ఉపాధి అవకాశాలు వచ్చాయని పేర్కొంది. ఈ ఏడాది దీపావళి సీజన్ వాణిజ్యం ఓ గొప్ప మైలురాయని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇవీ చదవండి:
బంగారంలానే వెండిని కూడా కల్తీ చేస్తారా?.. తెలుసుకోవటం ఎలా?..
సూచీలకు దివాళీ జోష్.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి