Share News

Stock Market: సూచీలకు దివాళీ జోష్.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

ABN , Publish Date - Oct 20 , 2025 | 10:12 AM

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, దేశీయంగా పండగ వాతావరణం, త్రైమాసిక ఫలితాలపై ఆశాజనకంగా ఉండడం దేశీయ సూచీల్లో జోష్ నింపాయి. సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి.

Stock Market: సూచీలకు దివాళీ జోష్.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
Stock Market

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, దేశీయంగా పండగ వాతావరణం, త్రైమాసిక ఫలితాలపై ఆశాజనకంగా ఉండడం దేశీయ సూచీల్లో జోష్ నింపాయి. సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లు సూచీలను పరుగులు పెట్టిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతన్నాయి. (Indian stock market).


గత శుక్రవారం ముగింపు (83, 952)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం 300 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి ఎగబాకింది. ఒక దశలో 700 పాయింట్లకు పైగా లాభపడింది. ప్రస్తుతం ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 472 పాయింట్ల లాభంతో 84, 424 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 138 పాయింట్ల లాభంతో 25, 848 వద్ద కొనసాగుతోంది (stock market news today).


సెన్సెక్స్‌లో ఆర్బీఎల్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్, రిలయన్స్, పాలీక్యాబ్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, హిందుస్థాన్ జింక్, ఐసీఐసీఐ బ్యాంక్, దాల్మియా భారత్, డిక్సన్ టెక్నాలజీస్ మొదలైన షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 348 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 308 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 87.83గా ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ముహూరత్ ట్రేడింగ్ ఏ రోజు, ఎప్పుడు.. పూర్తి వివరాలు మీ కోసం..


దీపావళి రోజున మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 20 , 2025 | 10:12 AM