Muhurat Trading 2025: ముహూరత్ ట్రేడింగ్ ఏ రోజు, ఎప్పుడు.. పూర్తి వివరాలు మీ కోసం..
ABN , Publish Date - Oct 20 , 2025 | 07:09 AM
భారత స్టాక్ మార్కెట్లు ప్రతి ఏటా దీపావళి రోజున గంటపాటు ముహూరత్ ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహిస్తాయి. ఈ సారి దీపావళి విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. వాస్తవానికి దీపావళిని అందరూ సోమవారం (అక్టోబర్ 20) జరుపుకుంటున్నారు.
భారత స్టాక్ మార్కెట్లు ప్రతి ఏటా దీపావళి రోజున గంటపాటు ముహూరత్ ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహిస్తాయి. ఈ సారి దీపావళి విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. వాస్తవానికి దీపావళిని అందరూ సోమవారం (అక్టోబర్ 20) జరుపుకుంటున్నారు. అయితే స్టాక్ మార్కెట్లు మాత్రం మంగళవారం (అక్టోబర్ 21) దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. దీంతో సోమవారం మార్కెట్లు యథాతథంగా పని చేస్తాయి (Diwali trading 2025).
దీపావళి సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం గంట పాటు ముహూరత్ ట్రేడింగ్ కోసం మార్కెట్లు ఓపెన్ అవుతాయి. మంగళవారం మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 గంటల వరకు ముహూరత్ ట్రేడింగ్ జరుగుతుంది. 1:30 నుంచి 1:45 గంటల వరకు ప్రీ-ఓపెన్ ట్రేడింగ్ సెషన్ ఉంటుంది. నిజానికి గత కొన్ని సంవత్సరాలుగా దీపావళి రోజున సాయంత్రం సమయంలోనే ముహూరత్ ట్రేడింగ్ ఉంటుంది. అయితే ఈ ఏడాది మాత్రం ఆ సమయాన్ని మధ్యాహ్నానికి మార్చారు (Muhurat trading time).
మంగళవారం సాయంత్రం సమయానికి అమావాస్య పోతుందనే కారణంతోనే ఈ ఏడాది ముహూరత్ ట్రేడింగ్ సమయాలను మార్చినట్టు నిపుణులు చెబుతున్నారు (Stock market muhurat time). ఈ నేపథ్యంలో సోమవారం మార్కెట్లు యథాతథంగా పని చేస్తాయి. మంగళవారం గంట పాటు ముహూరత్ ట్రేడింగ్ ఉంటుంది. బుధవారం బలిపూజ కారణంగా మార్కెట్లు పూర్తిగా పని చేయవు.
ఈ వార్తలు కూడా చదవండి..
అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
Read Latest AP News And Telugu News