Share News

CM Chandrababu On AP investments: పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

ABN , Publish Date - Oct 19 , 2025 | 12:23 PM

పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో అమరావతి- విశాఖపట్నంలో జరుగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ(ఆదివారం) ఏపీ సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

CM Chandrababu On AP investments: పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
CM Chandrababu On AP investments

అమరావతి, అక్టోబరు19(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులపై కూటమి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో అమరావతి - విశాఖపట్నంలో జరుగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Investment Summit)పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఇవాళ(ఆదివారం) ఏపీ సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, పరిశ్రమల శాఖ, ఈడీబీ ఉన్నతాధికారులు, సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.


నవంబరు 14,15 తేదీల్లో విశాఖపట్నం (Visakhapatnam)లో జరుగనున్న పెట్టుబడుల సదస్సుపై ఈ సమావేశంలో చర్చించారు. భాగస్వామ్య సదస్సుకు హాజరవ్వాలని ఇప్పటికే దేశ, విదేశాల్లోని వివిధ నగరాల్లో రోడ్ షోలు నిర్వహించింది కూటమి ప్రభుత్వం. విశాఖపట్నం పెట్టుబడుల సదస్సుకు హాజరు కావాలని పారిశ్రామిక వేత్తలకు సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఆహ్వానం పలికారు.


దావోస్ తరహాలోనే ఈ పెట్టుబడుల సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. భాగస్వామ్య సదస్సుకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పాలసీమేకర్లను కూడా ఆహ్వానించాలని సూచించారు. కేవలం పెట్టుబడుల కోసమే కాకుండా నాలెడ్జ్ షేరింగ్, లాజిస్టిక్స్, టెక్నాలజీ, తదితర రంగాల్లోని విధానాలపై చర్చించే అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఉద్యోగ సంఘాలతో సర్కార్ కీలక చర్చలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 19 , 2025 | 12:33 PM