Share News

Silver Jewelry Purity: బంగారంలానే వెండిని కూడా కల్తీ చేస్తారా?.. తెలుసుకోవటం ఎలా?..

ABN , Publish Date - Oct 21 , 2025 | 06:36 PM

మీరు 100 గ్రాముల వెండి నగను ఆర్డర్ చేస్తే అందులో 92.5 శాతం వెండి ఉంటుంది. మిగితా శాతం వేరే మెటల్స్ ఉంటాయి. అయితే, కొన్ని నగల షాపుల వాళ్లు 80 శాతం కంటే తక్కువ స్వచ్ఛత ఉన్న వాటికి కూడా మొత్తం డబ్బులు తీసుకుంటున్నారు.

Silver Jewelry Purity: బంగారంలానే వెండిని కూడా కల్తీ చేస్తారా?.. తెలుసుకోవటం ఎలా?..
Silver Jewelry Purity

దీపావళి లాంటి పండుగల సమయంలో జనం బంగారం, వెండిని కొనడాన్ని శుభసూచికంగా భావిస్తారు. అయితే, ఈ కాలంలో కల్తీ అనేది బాగా పెరిగిపోయింది. బంగారం, వెండి విషయంలోనూ ఈ సమస్య తప్పటం లేదు. కొంటున్నది స్వచ్ఛమైన బంగారం, వెండినా కాదా.. వాటి స్వచ్ఛత ఎంత అన్నది తెలీక జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా బంగారంతో తయారు అయ్యే వస్తువులు దృఢంగా ఉండటానికి అందులో కొన్ని రకాల మెటల్స్‌ను కలుపుతారు. మరి వెండి సంగతి ఏంటి?..


వెండిని కల్తీ చేస్తారా?..

బంగారంలానే వెండిని కూడా కొంత కల్తీ చేస్తారు. వెండి వస్తువులు దృఢంగా తయారు అవ్వడానికి అందులో ‘అల్లోయిస్’ అనే మెటల్‌ను కలుపుతారు. అయితే, కొంతమంది నగల వ్యాపారులు ఖర్చును తగ్గించుకునేందుకు చీప్ క్వాలిటీ మెటల్స్‌ను వెండిలో కలుపుతున్నారు. ఇలా చేయటం వల్ల వెండి స్వచ్ఛత, నాణ్యత తగ్గిపోతుంది. సాధారణంగా వెండితో తయారైన వస్తువుల స్వచ్ఛత 92.5 శాతం ఉంటుంది. దాన్నే స్టెర్లింగ్ సిల్వర్ అంటారు.


దానర్థం ఏంటంటే.. మీరు 100 గ్రాముల వెండి నగను ఆర్డర్ చేస్తే అందులో 92.5 శాతం వెండి ఉంటుంది. మిగితా శాతం వేరే మెటల్స్ ఉంటాయి. అయితే, కొన్ని నగల షాపుల వాళ్లు 80 శాతం కంటే తక్కువ స్వచ్ఛత ఉన్న వాటికి కూడా మొత్తం డబ్బులు తీసుకుంటున్నారు. వినియోగదారులు బాగా నష్టపోతున్నారు. మనం కొనే వెండి లేదా బంగారు నగలపై బీఐఎస్ హాల్ మార్క్ లేదా ఆరు అంకెల హెచ్‌యూఐడీ కోడ్ కచ్చితంగా ఉండాలి. ఇవి గనుక లేకపోతే వాటి స్వచ్ఛత తక్కువదని గ్రహించాలి. మీరు వెండి నగలు కొనాలంటే బీఐఎస్ సర్టిఫైడ్ షాపుల్లోనే కొనటం మంచిది.


ఇవి కూడా చదవండి

ఈ రైళ్లలో ప్రయాణించాలంటే ఆస్తులు అమ్మాల్సిందే..!

ఏపీకి గూగుల్.. తమిళనాడులో రచ్చపై స్పందించిన మంత్రి లోకేష్..

Updated Date - Oct 21 , 2025 | 06:39 PM