Share News

Mohammad Rizwan: రిజ్వాన్‌పై పీసీబీ వేటు..అందుకు ఒప్పుకోకపోవడమే కారణం!

ABN , Publish Date - Oct 21 , 2025 | 08:18 PM

పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ మహమ్మద్ రిజ్వాన్ కు గట్టి షాక్ తగిలింది. వన్డే కెప్టెన్సీ నుంచి అతడిని పీసీబీ తప్పించింది. వన్డే కొత్త సారథిగా షాహిన్ షా అఫ్రిదిని నియమించింది. ఈ మేరకు పీసీబీ ఓ ప్రకటనను విడుదల చేసింది.

Mohammad Rizwan: రిజ్వాన్‌పై పీసీబీ వేటు..అందుకు ఒప్పుకోకపోవడమే కారణం!
Rizwan

పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ మహమ్మద్ రిజ్వాన్ కు గట్టి షాక్ తగిలింది. వన్డే కెప్టెన్సీ నుంచి అతడిని పీసీబీ(Pakistan Cricket Board) తప్పించింది. వన్డే కొత్త సారథిగా షాహిన్ షా అఫ్రిదిని నియమించింది. ఈ మేరకు పీసీబీ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇస్లామాబాద్‌లో సెలక్షన్ కమిటీ, హెడ్ కోచ్ మైక్ హుస్సేన్‌తో జరిగిన సమావేశం తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీబీ తెలిపింది. అయితే ఓ అంశంలో రిజ్వాన్ ఒప్పుకోలేదని ఈ వేటు పడినట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే..


గతేడాది అక్టోబర్‌లో బాబర్ ఆజమ్ వారసుడిగా పాక్(Mohammad Rizwan)వన్డే సారథ్య బాధ్యతలన రిజ్వాన్‌ను తీసుకున్నాడు. అయితే ఇంత టైమ్ లో తొలగించడం, అలాగే ఇటీవల టీ20 కెప్టెన్సీ కోల్పోయిన షాహీన్‌ అఫ్రిదికి తిరిగి వన్డే పగ్గాలు అప్పగించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే మహమ్మద్ రిజ్వాన్ వేటు వెనుక షాకింగ్ కారణం ఉందని సమచారం. బెట్టింగ్ కంపెనీలను ప్రమోట్ చేయనని చెప్పడంతోనే రిజ్వాన్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించారని క్రీడా వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రజల ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ కంపెనీలను ప్రమోట్ చేయనని, ఆ సంస్థలతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోనని తెలియజేస్తూ పీసీబీ(PCB)కు రిజ్వాన్ లేఖ రాసినట్లు పాకిస్థాన్ క్రికెట్ వర్గాలు మీడియాకు తెలిపాయి.


కరేబియన్ ప్రీమియర్ లీగ్(CPL)‌లో సెయింట్ కిట్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన రిజ్వాన్.. బెట్టింగ్ కంపెనీ లోగోతో ఉన్న జెర్సీని ధరించేందుకు నిరాకరించాడు. స్పాన్సర్ లోగో లేని జెర్సీతో రిజ్వాన్ మైదానంలోకి దిగాడు. పాలస్తీనాకు మద్దతు తెలపడం కూడా అతని కెప్టెన్సీ వేటుకు కారణంగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ జట్టు మాజీ కెప్టెన్ రషీద్(Mohammad Rizwan) లతీఫ్ వెల్లడించాడు. మొత్తంగా ఈ పరిణామాలన్నీ అతని కెప్టెన్సీ వేటుకు కారణమయ్యాయి.



ఇవి కూడా చదవండి:

12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ

అసలు విషయం చెప్పేసిన సీఎం సిద్దరామయ్య.. అదేంటో తెలిస్తే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 21 , 2025 | 08:18 PM