Adelaid Oval Pitch: ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. యూవీ లైట్స్‌తో పిచ్‌ను ఆరబెట్టి..
ABN , Publish Date - Oct 21 , 2025 | 07:52 PM
ఆస్ట్రేలియాతో రెండే వన్డే అడిలైడ్ వేదికగా జరగనుంది. ఇప్పటికే అక్కడ వర్షం తాకిడి కొంత ఉంది. ఈ నేపథ్యంలో యూవీ లైట్స్‌తో పిచ్‌ను త్వరగా ఆరబెట్టి మ్యాచ్ నాటికి రెడీ చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌కు వర్షం పలు ఆటంకాలను సృష్టించింది. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఏకంగా నాలుగు సార్లు వాన కారణంగా మ్యాచ్‌కు విరామం ప్రకటించాల్సి వచ్చింది. అంతిమంగా మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించారు. వాన కారణంగా పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా మారిందన్న భావన కూడా ఉంది. చివరకు తొలి వన్డేలో భారత్ ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది. అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఇక అడిలైడ్ వేదికగా రెండో టెస్టు జరగనుండగా అక్కడ కూడా వర్షం తాకిడి కొద్దిగా ఉంది (Adelaid Oval Pitch UV Lights).
ఈ నేపథ్యంలో పిచ్ పరిస్థితిని మెరుగు పరిచేందుకు అక్కడి అధికారులు రంగంలోకి దిగారు. అడిలైడ్ ఓవల్ పిచ్‌పై ప్రత్యేకమైన యూవీ లైట్లను ఏర్పాటు చేసి మెరుగుపరుస్తున్నారు. యూవీ లైట్ల నుంచి వెలువడే అధిక కాంతి, వేడి కారణంగా తేమ త్వరగా ఆరిపోయి గురువారం నాటికి పిచ్ సిద్ధమైపోతుంది. అడిలైడ్ మ్యాచ్‌కూ వర్షం ఆటంకాలు సృష్టించొచ్చన్న భయాలు ఉన్నాయి. ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం, ఈ రెండు రోజులు అక్కడ వర్షం పడే అవకాశం ఉంది. కానీ మ్యాచ్ రోజున మాత్రం వర్షాలకు ఛాన్స్ చాలా తక్కువ.
ఇక పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వర్షం కలిగించిన ఆటంకాలు మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం చూపించాయి. పలుమార్లు ఇన్నింగ్స్‌కు బ్రేకులు పడటంతో ఓ దశలో భారత్ 45 పరుగులకే 4 వికెట్లు నష్టపోయి చిక్కుల్లో పడింది. చివరకు మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించడంతో 9 వికెట్లు నష్టపోయి 136 పరుగులు చేసింది. ఆ తరువాత డక్‌వర్త్ లూయిస్ స్టర్న్ పద్ధతిలో సవరించిన 131 పరుగుల లక్ష్యాన్ని ఆసిస్ దిగ్విజయంగా ఛేదించింది.
రెండో వన్డేలో భారత్ తిరిగి పుంజుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈసారైనా రోహిత్, గిల్, విరాట్, శ్రేయస్ అయ్యర్ తమ సత్తా చూపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. తొలి మ్యాచ్‌లో ఈ నలుగురూ పట్టుమని పాతిక పరుగులు కూడా చేయలేకపోయిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ ట్రోఫీని ఇవ్వకపోతే.. ఏసీసీ చీఫ్ నఖ్వీకి బీసీసీఐ వార్నింగ్
ప్లేయర్లు, సెలక్టర్ల మధ్య క్లారిటీ ఉండాలి.. షమీ వివాదంపై ఆర్ అశ్విన్ కామెంట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి