Ashwin on Shami Controversy: ప్లేయర్లు, సెలక్టర్ల మధ్య క్లారిటీ ఉండాలి.. షమీ వివాదంపై ఆర్ అశ్విన్ కామెంట్
ABN , Publish Date - Oct 20 , 2025 | 09:58 PM
ఆస్ట్రేలియా టూర్‌కు షమీని ఎంపిక చేయకపోవడం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ఆర్ అశ్విన్ స్పందించారు. ప్లేయర్లు, సెలక్టర్ల మధ్య క్లారిటీ ఉండాలని అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్లేయర్లు, సెలక్టర్ల మధ్య క్లారిటీ ఉండాలని మాజీ టీమిండియా స్పిన్నర్ ఆర్ అశ్విన్ అన్నాడు. ఆస్ట్రేలియా వన్డే టూర్‌కు టీమిండియా జట్టులో షమీకి చోట్టు దక్కకపోవడంపై వివాదం మొదలైన నేపథ్యంలో అశ్విన్ ఈ కామెంట్ చేశాడు. భారతీయ క్రికెట్ వ్యవహారాలన్నీ పరోక్ష సంభాషణల ఆధారంగా నడుస్తాయని అన్నాడు. తనను ఎంపిక చేయకపోవడంతో అజిత్ అగార్కర్‌పై షమీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నంత వరకూ తన ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏదీ లేదని అన్నాడు. అంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా అగార్కర్ మాట్లాడుతూ షమీ ఫిట్‌నెస్ స్థితి గురించి తనకు తెలియదని చెప్పాడు. దీంతో, వివాదం మొదలైంది. ఈ విషయంలో షమీతో ఫోన్‌లో మాట్లాడతానని అగార్కర్ ఆ తరువాత అన్నాడు (Ajit Agarkar - Shami).
ఈ నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానల్‌లో అశ్విన్ ఈ కామెంట్ చేశాడు. ‘నేను ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. భారత క్రికెట్‌లో వ్యవహారమంతా పరోక్ష సంభాషణలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో మార్పు రావాలని నేను ఆశిస్తున్నాను. ప్లేయర్లు, సెలక్టర్ల వైపు నుంచి కూడా మార్పు ఉండాలి. నేను గమనించింది ఏంటంటే.. ఏదైనా పరోక్షంగా చెబితే అది కచ్చితంగా మీడియాలో వస్తుంది. అసలు షమీ చేసిందేంటి.. అతడు మంచి క్రికెట్ ఆడాడు. అదే విషయాన్ని ప్రెస్ మీట్‌లో చెప్పాడు. ఇందులో తప్పేమీ లేదు. షమీ ప్రెస్ ముందు మాట్లాడటానికి కారణం తన నుంచి ఏమి ఆశిస్తున్నారనే విషయంలో అతడికి క్లారిటీ లేకపోవడమే. కానీ ఈ వ్యవహారంలో అజిత్ స్పందించిన తీరు నాకు నచ్చింది. వారిద్దరూ ఈ విషయంలో ఫోన్‌లో మాట్లాడుకున్నారనే అనుకుంటున్నా’ అని అశ్విన్ అన్నాడు.
ఇవి కూడా చదవండి
Babar Azam: దీపావళి వేళ..మరోసారి తుస్సుమన్న బాబర్!
తెలుగోడిపై రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి