Babar Azam: దీపావళి వేళ..మరోసారి తుస్సుమన్న బాబర్!
ABN , Publish Date - Oct 20 , 2025 | 05:12 PM
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజమ్ కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. ఇప్పటికే అనేక సార్లు విఫలమైన బాబర్..దీపావళి పండగ వేళ మరోసారి తుస్సుమన్నాడు. రావల్పిండి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 16 పరుగులకే పెవిలియన్ చేరాడు.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజమ్(Babar Azam)కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. ఇప్పటికే అనేక సార్లు విఫలమైన బాబర్..దీపావళి పండగ వేళ మరోసారి తుస్సుమన్నాడు. రావల్పిండి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 16 పరుగులకే పెవిలియన్ చేరాడు. బాబర్ అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేసి రెండేళ్లైపోయింది. చివరగా 2023లో పసికూన నేపాల్ పై శతకం చేశాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. బాబర్ వరుస వైఫల్యాలు చూసి సొంత అభిమానులే(Pak Fan) విసుగెత్తిపోయారు.
2023 ఆగస్ట్ 30న పసికూన నేపాల్(Nepal cricket)పై వన్డే సెంచరీ చేసిన తర్వాత నుంచి బాబర్ 73 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే వీటిల్లో ఒక్కసారి కూడా మూడంకెల మార్కును బాబర్ తాకలేకపోయాడు. మధ్యలో అడపాదడపా హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. ఇలా వరుస వైఫల్యాల నేపథ్యంలో ఆల్ ఫార్మాట్ కెప్టెన్సీని కోల్పోయిన బాబర్.. ప్రస్తుతం జట్టులో స్థానాన్ని కూడా డేంజర్ లో పెట్టుకున్నాడు. ఇక ఆశ్చర్యం ఏమిటంటే.. రెండేళ్లకు పైగా ఫామ్ కోల్పోయిన బాబర్‌ను పాక్ ఫ్యాన్స్ ఓ దశలో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli)తో పోల్చారు. వరుసగా బాబర్ విఫలమవుతున్నా.. కొందరు పాకిస్థానీలు అతడు.. విరాట్ కంటే మెరుగైన బ్యాటర్ అని సిగ్గులేకుండా చెప్పుకుంటుంటున్నారు.
ఇదిలా ఉంటే, రెండు టెస్ట్‌లు, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా(South Africa) జట్టు పాక్‌లో పర్యటిస్తుంది. తొలి టెస్ట్‌లో పాక్ 93 పరుగుల తేడాతో ప్రోటీస్ జట్టు విజయం సాధించింది. ఈ టెస్టులో బాబర్ వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో (23, 42) విఫలమయ్యాడు. తాజాగా రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లోనూ అదే తంతు కొనసాగింది. సోమవారం (అక్టోబర్ 20) ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్(Pakistan) టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 16 పరుగులు చేసిన బాబర్..కేశవ్ మహారాజ్(Keshav Maharaj) బౌలింగ్ లో ఔటయ్యాడు.ఇలా 73 ఇన్నింగ్స్ లో ఫెయిల్ అవుతున్న వీడిని ఎలా భరిస్తున్నార్రా సామీ అంటూ మిగతా దేశ క్రికెట్ అభిమానులు తలలు బాదుకుంటున్నారు. పాక్ క్రికెట్ బోర్డు(PCB)కు గతిలేక ఈ జిడ్డును పట్టుకొని వేలాడుతుందని కామెంట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి:
Telangana Crime: తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ
Chennai News: కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే.. కేసు నమోదు