Late Night Call From Child: అర్ధరాత్రి డీజీపీకి చిన్నారి ఫోన్ కాల్.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..
ABN , Publish Date - Oct 20 , 2025 | 04:04 PM
ఎక్కువ సేపు ఫోన్ వాడితే డిప్రెషన్, యాంగ్జైటీ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎమోషనల్, బిహేవియరల్ సమస్యలు వస్తాయి. మానసికంగా చాలా రకాల సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.
హరియాణా డీజీపీ ఓపీ సింగ్‌కు అర్ధరాత్రి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ చేసింది చిన్న పిల్లాడని తెలిసి ఆయన ఆశ్చర్యపోయారు. ఎందుకు ఫోన్ చేశావని అడిగారు. పొరపాటున కాల్ వచ్చిందని ఆ బాలుడు చెప్పాడు. డీజీపీ మాత్రం ఆ బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడాడు. వారు ఎలాంటి సమస్య లేదని, పొరపాటున కాల్ వచ్చిందని స్పష్టం చేశారు. ఈ సంఘటనపై డీజీపీ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘నాకు అర్ధరాత్రి ఓ ఫోన్ కాల్ వచ్చింది. నాకు కాల్ చేసింది బాలుడని, పొరపాటున చేశాడని తెలిసింది.
ఫోన్ పెట్టేసేటప్పుడు నేను ఆ బాలుడికి ఓ మాట చెప్పాను. ‘ఫోన్ అధికంగా వాడితే చిరునవ్వులకు దూరం అవుతావు’ అని చెప్పా. ఫోన్ అధికంగా వాడితే బ్రెయిన్ ఎలా దెబ్బ తింటుందో ఓ వీడియోను అతడికి పంపాను. పిల్లలు మట్టిలో ఆడుకోవాలి ఫోన్‌లో కాదు. ఎక్కువ సేపు ఫోన్ వాడితే డిప్రెషన్, యాంగ్జైటీ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎమోషనల్, బిహేవియరల్ సమస్యలు వస్తాయి. మానసికంగా చాలా రకాల సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. మెంటల్ డెవలప్‌మెంట్ తగ్గిపోతుంది’ అని రాసుకొచ్చారు.
పిల్లాడితో జరిగిన సంభాషణల తాలూకా వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లను షేర్ చేశారు. డీజీపీ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఈ మధ్య కాలంలో పిల్లలు మట్టిలో ఆడుకోవటమే తగ్గిపోయింది. అంతా ఫోన్‌లోనే’.. ‘పిల్లలది ఏం తప్పు లేదు. తల్లిదండ్రులే ఫోన్ ఇచ్చి చెడగొడుతున్నారు’..‘ఫోన్ వాడకం పెరిగిపోయిన తర్వాతే అన్ని సమస్యలు వస్తున్నాయి. మనుషులు మానసికంగా చాలా నష్టపోతున్నారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
2 వేల కేజీల స్వీట్లు నది పాలు.. అధికారులపై వెల్లువెత్తిన విమర్శలు..
సీఎం చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ భేటీ