Share News

2000 KG Adulterated Mithai: 2 వేల కేజీల స్వీట్లు నది పాలు.. అధికారులపై వెల్లువెత్తిన విమర్శలు..

ABN , Publish Date - Oct 20 , 2025 | 03:02 PM

నిజానికి అధికారులు చేసింది మంచి పనే అయినా.. వాళ్లు కల్తీ స్వీట్లను ప్లాస్టిక్ డబ్బాలతో సహా నదిలో పడేయటం ప్రజలకి నచ్చలేదు. దాని కారణంగా నదిలోని నీరు పాడవుతుందని అంటున్నారు.

2000 KG Adulterated Mithai: 2 వేల కేజీల స్వీట్లు నది పాలు.. అధికారులపై వెల్లువెత్తిన విమర్శలు..
2000 KG Adulterated Mithai

దీపావళి పండుగ వచ్చిందంటే చాలు టపాసులతో పాటు స్వీట్లకు కూడా గిరాకీ పెరిగిపోతుంది. జనం పెద్ద ఎత్తున స్వీట్లు కొంటూ ఉంటారు. స్వీట్ల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కొంతమంది అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కల్తీ స్వీట్లు తయారు చేసి అమ్ముతున్నారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు పెద్ద ఎత్తున కల్తీ స్వీట్లను పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న 2 వేల కేజీల కల్తీ స్వీట్లను నదిలో పారేశారు. అధికారులు ఆ స్వీట్లను అట్టపెట్టెలలోంచి తీసి నదిలో పడేశారు. చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలతో సహా స్వీట్లను నదిలో వేశారు.


ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అధికారులు చేసింది మంచిపనే కదా. ఎందుకు తిడుతున్నారు’ అని అనుకుంటున్నారా?. నిజానికి అధికారులు చేసింది మంచి పనే అయినా.. వాళ్లు కల్తీ స్వీట్లను ప్లాస్టిక్ డబ్బాలతో సహా నదిలో పడేయటం ప్రజలకి నచ్చలేదు. దాని కారణంగా నదిలోని నీరు పాడవుతుందని అంటున్నారు. ఆ కల్తీ స్వీట్లను భూమిలో పూడ్చి ఉంటే బాగుండేదని సలహా ఇస్తున్నారు.


హైదరాబాద్‌లో అధికారుల తనిఖీలు..

దీపావళి పండుగ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న స్వీట్ షాపులపై తనిఖీలు చేస్తున్నారు. కొన్ని షాపుల్లో శాంపిల్స్ సేకరించి టెస్ట్ కోసం ల్యాబ్‌కు పంపించారు. నగరంలో 45 స్వీట్ షాపుల్లో తనిఖీలు చేశారు. భారీగా సింథటిక్ కలర్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. కల్తీ నెయ్యి, కల్తీ వంట నూనెతో నిర్వాహకులు స్వీట్స్ తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. కిచెన్‌లు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. స్వీట్స్ తయారు చేసే స్థలంలో ఈగలు, దోమలు ఉన్నట్లు తేలింది. కొన్ని స్వీట్ షాప్స్‌లో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబుల్, ఎక్స్ పైరీ డేట్ లేదని అధికారులు వెల్లడించారు. నిబంధనలు పాటించని షాపులకు నోటీసులు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి

భర్త, అత్త, మామ వేధింపులు.. మరిదితో పడుకోవాలని ఒత్తిడి.. మహిళ సెల్ఫీ సూసైడ్

కామాంధుడి అరాచకం.. ట్రైన్‌లో వెళుతున్న బాలికపై..

Updated Date - Oct 20 , 2025 | 03:41 PM