Man Attack on Minor Girl: కామాంధుడి అరాచకం.. ట్రైన్‌లో వెళుతున్న బాలికపై..
ABN , Publish Date - Oct 20 , 2025 | 02:05 PM
ట్రైన్‌లో ఒక మైనర్ బాలికని పెళ్లయి పిల్లలు ఉన్న ఓ కామాంధుడు లైంగికంగా వేధించాడు. బిహార్ రాష్ట్రంలోని ఛప్రా పట్టణంలో 55103 ట్రైన్‌లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎవరూ చూడటం లేదనుకొని.. అసభ్యకరంగా తాకేందుకు యత్నించాడు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 20: కళ్ళు మూసుకుపోయి కామంతో రగిలిపోతున్న కామాంధులు రోజురోజుకి పెరిగిపోతున్నారు. ఛాన్స్ దొరికిందంటే చాలు.. తమ కామ వాంఛను తీర్చుకునేందుకు ఏ అడ్డదారి అయినా తొక్కుతున్నారు. వీరు మగాళ్లా? మృగాల్లా? అనే స్థాయికి దిగజారుతున్నారు. శిశువులు, మైనర్లు, యువతులు, మహిళలు.. ఇలా పండు ముసలివరకు ఏ ఒక్క ఆడదాన్ని వదలట్లేదు. ఎవ్వరూ లేని సమయం చూసి విషపు నాగు కాటువేసినట్లుగా ఆడవాళ్లపై అత్యాచారాలు చేస్తున్నారు. తీవ్ర ఉద్రేకంతో పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. అత్యాచారం చేయడమే కాకుండా ప్రైవేట్ పార్ట్‌లపై దారుణంగా దాడి చేసి చంపేస్తున్నారు. రాక్షసుల కంటే ఘోరంగా క్రిమినల్ ఆలోచనలతో వికృతచేష్టలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు ఇలాంటి దారుణాలు అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దుర్మార్గుల్లో ఎలాంటి మార్పు రావట్లేదు. తాజాగా ఓ ట్రైన్‌లో మైనర్ బాలికను ఒక కామాంధుడు లైంగికంగా వేధించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ట్రైన్‌లో ఒక మైనర్ బాలికని పెళ్లయి పిల్లలు ఉన్న ఓ కామాంధుడు లైంగికంగా వేధించాడు. బిహార్ రాష్ట్రంలోని ఛప్రా పట్టణంలో 55103 ట్రైన్‌లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎవరూ చూడటం లేదనుకొని.. అసభ్యకరంగా తాకేందుకు యత్నించాడు. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోగానే.. మెల్లగా జారుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబందించి అక్కడే ఉన్న ఒక వ్యక్తి చాటున వీడియో తీశాడు. ఇదేం పని? అని ప్రశ్నించగా.. మెల్లగా జారుకున్నాడు. ట్రైన్ లో ఉన్నవారంతా అతని ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్ పై ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదా? అని ప్రశ్నించారు. ఇందుకు సంబందించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కామాంధుడికి పోలీసులు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి:
Telangana Crime: తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ
Chennai News: కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే.. కేసునమోదు