Share News

Chennai News: కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే.. కేసునమోదు

ABN , Publish Date - Oct 20 , 2025 | 12:36 PM

స్థానిక అన్నాసాలైలో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్‌ విభాగం కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఎస్‌.రాజ్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నాసాలైలో ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్‌ చేసిన కారును అక్కడినుంచి తరలించాలని ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ప్రభాకరన్‌ కోరగా నిరాకరించిన మైలాడుదురై ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌ ఆయనపై చేయి చేసుకున్నారు.

Chennai News: కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే.. కేసునమోదు

చెన్నై: స్థానిక అన్నాసాలైలో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్‌ విభాగం కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఎస్‌.రాజ్‌కుమార్‌(Congress MLA S. Rajkumar)పై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నాసాలైలో ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్‌ చేసిన కారును అక్కడినుంచి తరలించాలని ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ప్రభాకరన్‌(Traffic Constable Prabhakaran) కోరగా నిరాకరించిన మైలాడుదురై ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌(Mayiladurai MLA Rajkumar) ఆయనపై చేయి చేసుకున్నారు.


nani5.2.jpg

అంతటితో ఊరుకోకుండా తన కారు ముందు చక్రానికి తాళం వేయడంతో ఎమ్మెల్యే తనను అసభ్యకరమైన పదజాలంతో ధూషించినట్లు ప్రభాకరన్‌ అన్నాసాలై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దీపావళి రోజున మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ముస్లింలకు అట్రాసిటీ చట్టం తీసుకురావాలి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 20 , 2025 | 12:36 PM