Dowry harassment: భర్త, అత్త, మామ వేధింపులు.. మరిదితో పడుకోవాలని ఒత్తిడి.. మహిళ సెల్ఫీ సూసైడ్
ABN , Publish Date - Oct 20 , 2025 | 02:36 PM
పుష్పను తపసీహళ్లి గ్రామానికి చెందిన వేణుతో సుమారు ఏడేళ్ల క్రితం పెళ్లి చేశారు. వివాహానంతరం అదనపు వరకట్నం, స్థలానికి సంబంధించి భర్త కుటుంబం వేధింపులు చేస్తున్నారని మహిళ వీడియో తీస్తూ కన్నీటిపర్యంతమైంది.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 20: భర్త, అత్త, మామ, మరిది బంధువులు వరకట్నం, స్థలానికి సంబంధించి వేధింపులు చేస్తున్నారని ఆరోపిస్తూ ఒక గృహిణి వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్న కర్ణాటకలో జరిగింది. బెంగళూరులోని దొడ్డబళ్లాపుర తాలూకా ఘాటి సమీపంలోని విశ్వేశ్వరయ్య పిక్ అప్ డ్యామ్ వద్ద ఈ ఘటన జరిగింది. మృతురాలిని దొడ్డబళ్లాపుర తాలూకా సోతెనహళ్లి గ్రామానికి చెందిన మహిళ పుష్ప (23)గా గుర్తించారు. ఆమె చనిపోక ముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకొని, తన మరణానికి తన అత్తింటి వారే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పుష్పను తపసీహళ్లి గ్రామానికి చెందిన వేణుతో సుమారు ఏడేళ్ల క్రితం పెళ్లి చేశారు. వివాహానంతరం అదనపు వరకట్నం, స్థలానికి సంబంధించి భర్త కుటుంబం వేధింపులు చేస్తున్నారని మహిళ వీడియో తీస్తూ కన్నీటిపర్యంతమైంది. భర్తకు రెండవ వివాహం చేయాలనే కోరిక ఉండి, మానసికంగా కూడా వేధించేవాడని చెప్పింది. అంతేకాకుండా తినే ఆహారంలో విషం కలిపి చంపే ప్రయత్నం చేశారని పేర్కొంది. మరిదితో కలిసిరాత్రిళ్ళు పడుకోవాలని తనను బలవంతం చేశారని ఆరోపించింది.
సుమారు 8 నిమిషాల వీడియో తీసిన పుష్ప ఆత్మహత్య చేసుకుంది. మూడు రోజులుగా అదృశ్యమైన పుష్ప శవం సోమవారం విశ్వేశ్వరయ్య పిక్-అప్ డ్యామ్‌లో తేలింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త మామను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వీడియోలో పుష్ప భర్త వేణు, అత్త భారతీ, మామ గోవిందప్ప, మరిది నారాయణస్వామి, బంధువులు ముత్తేగౌడ, పల్లవిల వేధింపుల వల్లనే తాను చనిపోయానని, వారికి తగిన శిక్ష విధించాలని కోరింది. తన మరణానంతరం తన శవాన్ని భర్త ఇంటి ప్రాంగణంలోనే పాతిపెట్టాలని పుష్ప విజ్ఞప్తి చేసింది.
ఇవి కూడా చదవండి:
Telangana Crime: తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ
Man Attack on Minor Girl: కామాంధుడి అరాచకం.. ట్రైన్‌లో వెళుతున్న బాలికపై..