Egg Thrown At Imran Khan Sister: జైలు బయట మాజీ ప్రధాని సోదరిపై గుడ్డుతో దాడి..
ABN, Publish Date - Sep 06 , 2025 | 07:04 AM
పోలీసులు గుడ్డుతో దాడి చేసిన మహిళతో పాటు మరో మహిళను కూడా అరెస్ట్ చేశారు. వారు పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్‌సాఫ్ (పీటీఐ) సభ్యులుగా తేలింది. జర్నలిస్టులు అడిగిన ఓ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పకపోవటంతో గుడ్డుతో దాడి చేసినట్లు వారు తెలిపారు.
మాజీ పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖానుమ్‌పై ఓ మహిళ గుడ్డుతో దాడి చేసింది. రావల్పిండిలోని అడియాలా జైలు బయట ఈ సంఘటన చోటుచేసుకుంది. తోషాఖానా కేసు విచారణ సందర్భంగా అలీమా ఖానుమ్ అడియాలా జైలు దగ్గరకు చేరుకున్నారు. విచారణ అయిపోయిన తర్వాత జైలు బయట ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఓ మహిళ అలీమాపై గుడ్డుతో దాడి చేసింది. దీంతో అలీమా పక్కనే ఉన్న మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఎవరు చేశారు ఈ పని?’ అంటూ మండిపడింది.
అలీమా మాత్రం ‘పర్లేదు వదిలేయండి’ అంటూ ఎంతో ఓర్పుగా వ్యవహరించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, పోలీసులు గుడ్డుతో దాడి చేసిన మహిళతో పాటు మరో మహిళను కూడా అరెస్ట్ చేశారు. వారు పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్‌సాఫ్ (పీటీఐ) సభ్యులుగా తేలింది. జర్నలిస్టులు అడిగిన ఓ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పకపోవటంతో గుడ్డుతో దాడి చేసినట్లు వారు తెలిపారు. పీటీఐ మద్దతుదారులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
తోషాఖానా కేసు వివరాలు..
మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తోషాఖానా కేసులో జైలు పాలయ్యారు. ఆయన అధికారంలో ఉన్నపుడు ప్రభుత్వానికి చెందిన తోషాఖానా నుంచి అక్రమంగా బహుమతులు కొనటం, అమ్మటం చేశారని విచారణలో తేలింది. దాదాపు 5 కోట్ల రూపాయల విలువైన బహుమతుల్ని ఆయన అమ్మినట్లు బయటపడింది. ఈ కేసుకు సంబంధించి 2023, ఆగస్టు నెలలో కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష వేసింది. ఇమ్రాన్‌తో పాటు ఆయన భార్య బుష్ర బీబీ కూడా ది తోషాఖాన కేసులో ఇరుక్కున్నారు.
ఇవి కూడా చదవండి
ఇంకా సకల శాఖా మంత్రిననే భ్రమలోనే సజ్జల
గురువులపై వైసీపీ జుగుప్సాకర వ్యాఖ్యలు: లోకేశ్
Updated Date - Sep 06 , 2025 | 07:15 AM