గురువులపై వైసీపీ జుగుప్సాకర వ్యాఖ్యలు: లోకేశ్
ABN , Publish Date - Sep 06 , 2025 | 06:37 AM
టీచర్లూ... మీపై వైసీపీ చేసిన అతి జుగుప్సాకరమైన వ్యాఖ్యలపై తగు రీతిలో స్పందించండి అని మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు.
అమరావతి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): ‘టీచర్లూ... మీపై వైసీపీ చేసిన అతి జుగుప్సాకరమైన వ్యాఖ్యలపై తగు రీతిలో స్పందించండి’ అని మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. ‘భావిభారత పౌరులను తీర్చిదిద్దుతూ, బాధ్యతాయుతంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను వైసీపీ నీచంగా చిత్రీకరించింది. వైసీపీ ఫేక్ హ్యాండిల్ నేడు ఒక ఫొటోను షేర్ చేసింది. దానికింద రాష్ట్రంలో టీచర్లు తాగి బెంచీల కింద పడుకుంటున్నారంటూ అతి జుగుప్సాకర వ్యాఖ్యానం ఉంది. ఎక్కడో పక్క రాష్ట్రంలో ఏదో ఒక సందర్భంలో బయటకు వచ్చిన ఫొటోను ఏపీలో జరిగినట్లు చెప్పడం క్షమించరాని నేరం. విద్య నేర్పే గురువుల పట్ల కూడా అతి నీచంగా వ్యవహరించిన వైసీపీ నీతిబాహ్యమైన చర్యల్లో మరో మెట్టు దిగజారింది’ అని లోకేశ్ విమర్శించారు.