Pilli Manikyarao: ఇంకా సకల శాఖా మంత్రిననే భ్రమలోనే సజ్జల
ABN , Publish Date - Sep 06 , 2025 | 06:40 AM
సజ్జల రామకృష్ణారెడ్డి... సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఏపీ లిడ్‌క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మండిపడ్డారు.
లిడ్‌క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు ఆగ్రహం
అమరావతి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): సజ్జల రామకృష్ణారెడ్డి... సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఏపీ లిడ్‌క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మండిపడ్డారు. ‘సజ్జల.. జగన్ దగ్గర బంట్రోతు, కార్పొరేటర్‌గా కూడా గెలవని వ్యక్తి.. అలాంటివాడు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడటం హాస్యాస్పం. సజ్జల, భార్గవ్, జగన్‌తోసహా వైసీపీ నేతలందరూ జైలుకు వెళ్లడం ఖాయం’ అని పిల్లి హెచ్చరించారు. కాగా, సజ్జల వ్యాఖ్యలపై ఎమెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ కార్యాలయాలకు త్వరలో టూలెట్ బోర్డులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు.