ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MJ Akbar: పాక్‌స్థాన్‌ను రెండు తలల విషనాగుతో పోల్చిన ఎంజే అక్బర్

ABN, Publish Date - May 31 , 2025 | 04:20 PM

ఏప్రిల్ 26న పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రజలను కాల్చిచంపారని, ఇందుకు ప్రతిగా ఇస్లామాబాద్‌పై ఇండియా కఠిన చర్యలు తీసుకుందని, దీంతో న్యూఢిల్లీతో ఇస్లామాబాద్ చర్చల ప్రస్తావన చేస్తోందని ఎంజే అక్బర్ అన్నారు.

డెన్మార్క్: పహల్గాం ఉగ్రదాడి అత్యంత పాశవికమని, యూరప్ చవిచూసిన కమ్యూనల్ టెర్రరిజం తరహా అనాగరి చర్య అని కోపెన్ హాగన్‌లో పర్యటిస్తున్న అఖిల పక్ష ప్రతినిధి బృందం సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ (MJ Akbar) అన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ను విషపు నాగుతో పోల్చారు. ఆ దేశంలోని ప్రభుత్వానికి చీలిక నాలుక (Forked tongue), రెండు తలలు (Doble faced) ఉన్నాయని అన్నారు. డెన్మార్ రాజధాని కోపెన్ హాగన్‌లో ఎన్ఐఆర్‌లతో అఖిలపక్ష ఎంపీల ప్రతినిధి బృందం మాట్లాడింది. ఈ ప్రతినిధి బృందానికి బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ సారథ్యం వహించారు.


ఎవరితో మాట్లాడాలి?

ఏప్రిల్ 26న పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రజలను కాల్చిచంపారని, ఇందుకు ప్రతిగా ఇస్లామాబాద్‌పై ఇండియా కఠిన చర్యలు తీసుకుందని, దీంతో న్యూఢిల్లీతో ఇస్లామాబాద్ చర్చల ప్రస్తావన చేస్తోందన్నారు. 'పాకిస్థాన్‌లో రెండు ముఖాల ప్రభుత్వం ఉంది. ఏ ముఖంతో మేము మాట్లాడాలి? అక్కడున్నది చీలిక నాలుక ఉన్న ప్రభుత్వం. ఏ నాలుకతో చర్చించాలి? విషపు నాలుకతో వాళ్లు మాట్లాడతారు. పాము ఎప్పుడూ తన విషం వల్ల తాను చనిపోదు. ఇతరులకే నష్టం' అని పాక్‌పై ఆయన నిప్పులు చెరిగారు. చర్చల పేరుతో కాలాన్ని తాము వృథా చేయమని, సమస్యలను పరిష్కరించుకునే నైతిక స్థైర్యం తమకుందని చెప్పారు. పాక్ చర్చల ప్రస్తావనంతా ఒక బూటకమని, మరో ఉగ్రదాడికి ఆదేశం సిద్ధమయ్యేంతవరకూ కాలయాపన జరిపే ఉద్దేశం మాత్రమేనని పాక్ వైఖరిని ఎండగట్టారు.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాక్‌కు గుణపాఠం చెప్పేందుకు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని అక్బర్ అన్నారు. పాకిస్థాన్ బూటకపు మాటలను నమ్మే నాయకత్వం కాదని స్పష్టం చేశారు. కాగా, డెన్మార్‌లో పర్యటిస్తున్న ప్రతినిధి బృందంలో రవిశంకర్ ప్రసాద్, ఎంపీ అక్బర్‌తో పాటు బీజేపీ ఎంపీలు దగ్గుబాటి పురంధరేశ్వరి, సమిక్ భట్టాచార్య, శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాకం చతుర్వేది, కాంగ్రెస్ ఎంపీలు గులామ్ అలి ఖతానా, అమర్ సింగ్, అంబాసిడర్ పంకజ్ శరణ్ ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

జాతీయ వీరత్వానికి చిహ్నంగా సింధూరం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

పాకిస్థాన్‌పై ఘర్షణల్లో ఫైటర్ జెట్లను కోల్పోయాం.. సీడీఎస్ వెల్లడి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 31 , 2025 | 04:20 PM