Trump Modi friendship: మోదీ గొప్ప నేత.. కానీ, ఆయన చేస్తున్నది నచ్చడం లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
ABN, Publish Date - Sep 06 , 2025 | 09:06 AM
భారత్‌తో స్నేహ సంబంధాల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ పన్నుల నేపథ్యంలో భారత్-అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్‌ను చైనాకు కోల్పోయాం అంటూ ఇటీవల ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
భారత్‌తో స్నేహ సంబంధాల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ పన్నుల నేపథ్యంలో భారత్-అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్‌ను చైనాకు కోల్పోయాం (Lost India to China) అంటూ ఇటీవల ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న ట్రంప్ వారడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు (India US relations).
భారత్, రష్యాలను చైనాకు కోల్పోయినట్టు చేసిన పోస్ట్ గురించి ట్రంప్‌ను విలేకరులు ప్రశ్నించారు. దానికి ఆయన స్పందిస్తూ.. 'ప్రస్తుతం భారత్ వ్యవహరిస్తున్న తీరు నన్ను తీవ్ర నిరాశకు గురి చేసింది. రష్యా నుంచి పెద్ద మొత్తంలో వారు చమురు కొనుగోలు చేస్తున్నారు. వారు వెనక్కి తగ్గకపోవడంతోనే భారత దిగుమతులపై భారీ పన్నులు విధించా. భారత్‌పై విధించిన 50 శాతం పన్నులు చాలా ఎక్కువగానే ఉన్నాయి' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే ప్రధాని మోదీతో తనకున్న వ్యక్తిగత అనుబంధం గురించి కూడా ట్రంప్ మాట్లాడారు (Trump Modi friendship).
'మోదీ గొప్ప ప్రధాని. ఆయనతో నాకు వ్యక్తిగతంగా మంచి అనుబంధముంది. కానీ, ప్రస్తుతం ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి భారత్-అమెరికా మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని నెలల క్రితమే మోదీ అమెరికాలో పర్యటించారు. మేమిద్దరం రోజ్ గార్డెన్‌లో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించామ'ని ట్రంప్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
యువీ అంటే ధోనీ, కోహ్లీకి భయం.. అందుకే వెన్నుపోటు: యోగ్‌రాజ్ సంచలన ఆరోపణలు..
ముంబైకా రాజా.. రోహిత్ శర్మ కారును చుట్టుముట్టి ఫ్యాన్స్ హంగామా.. వీడియో వైరల్..
Updated Date - Sep 06 , 2025 | 09:24 AM