Rohit Sharma fans: ముంబైకా రాజా.. రోహిత్ శర్మ కారును చుట్టుముట్టి ఫ్యాన్స్ హంగామా.. వీడియో వైరల్..
ABN , Publish Date - Sep 06 , 2025 | 06:58 AM
టీమిండియా దిగ్గజ ఆటగాడు, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా ముంబైలోని వర్లీలో సందడి చేశాడు. గణపతి పూజల కోసం ఓ మండపానికి వెళ్లిన రోహిత్‌ను అతడి అభిమానులు చుట్టుముట్టారు. రోహిత్ కారును కదలనివ్వలేదు. దీంతో రోహిత్ కారు సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశాడు.
టీమిండియా దిగ్గజ ఆటగాడు, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తాజాగా ముంబైలోని వర్లీలో సందడి చేశాడు. గణపతి పూజల కోసం ఓ మండపానికి వెళ్లిన రోహిత్‌ను అతడి అభిమానులు (Rohit Sharma fans) చుట్టుముట్టారు. రోహిత్ కారును కదలనివ్వలేదు. దీంతో రోహిత్ కారు సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశాడు. దీంతో అభిమానులు.. 'ముంబైకా రాజా' (Mumbaicha Raja) అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గత నాలుగు నెలలుగా విశ్రాంతి తీసుకుంటున్న రోహిత్ శర్మ అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఇటీవల బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఫిట్‌నెస్ పరీక్షకు హాజరై పాసయ్యాడు. అంతేకాదు.. గత మూడు నెలల కాలంలో రోహిత్ శర్మ ఏకంగా 20 కిలోల బరువు తగ్గినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. రోహిత్ సన్నబడిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (Rohit Sharma car video).
కాగా, ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ రోహిత్ శర్మ భవితవ్యాన్ని నిర్ణయించునుంది (Indian cricket captain). రోహిత్ ఆ సిరీస్‌లో అంచనాలకు అనుగుణంగా రాణిస్తే అతడు కొనసాగడంపై ఎలాంటి వివాదమూ ఉండదు. ఒకవేళ ఆ టోర్నీలో గనక రోహిత్ విఫలమైతే 2027 ప్రపంచకప్ జట్టులో రోహిత్ ఉండేది అనుమానంగా మారుతుంది.
ఇవి కూడా చదవండి..
ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్ యాప్ కేసులో విచారణ..
కోహ్లీ పాస్.. లండన్‌లో టెస్ట్‌కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..