Share News

Dhoni vs Yuvraj: యువీ అంటే ధోనీ, కోహ్లీకి భయం.. అందుకే వెన్నుపోటు: యోగ్‌రాజ్ సంచలన ఆరోపణలు..

ABN , Publish Date - Sep 06 , 2025 | 08:47 AM

డాషింగ్ బ్యాటర్ యువరాజ్ సింగ్ టీమిండియా క్రికెటర్ చరిత్రలో ఓ దిగ్గజ ఆటగాడు. భారత్ టీ-20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి టీమిండియాకు ఎన్నో చారిత్రాత్మక విజయాలు అందించాడు.

Dhoni vs Yuvraj: యువీ అంటే ధోనీ, కోహ్లీకి భయం.. అందుకే వెన్నుపోటు: యోగ్‌రాజ్ సంచలన ఆరోపణలు..
MS Dhoni, Yuvraj Singh, Virat Kohli

డాషింగ్ బ్యాటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) టీమిండియా క్రికెటర్ చరిత్రలో ఓ దిగ్గజ ఆటగాడు. భారత్ టీ-20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)తో కలిసి టీమిండియాకు ఎన్నో చారిత్రాత్మక విజయాలు అందించాడు. అయితే యువరాజ్‌కు తగినంత గుర్తింపు రాకపోవడానికి ధోనీనే కారణమని యువరాజ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ (Yograj Singh) తరచుగా ఆరోపిస్తుంటారు.


తాజాగా ధోనీతో పాటు విరాట్ కోహ్లీ (Virat Kohli)పై కూడా యోగ్‌రాజ్ సంచలన ఆరోపణలు చేశారు. 'ఒకరు ఎదుగుతుంటే వెన్నుపోటు పొడిచే వారు ఎందరో ఉంటారు. యువరాజ్ సింగ్ అంటే చాలా మంది భయపడ్డారు. తమ స్థానం ఎక్కడ లాగేసుకుంటాడో అని వారికి భయం. యువరాజ్ చాలా గొప్ప క్రికెటర్. అందుకే అతడిని చూసి స్వంత జట్టులోని వారే భయపడి వెన్నుపోటు పొడిచారు. ధోనీతో సహా చాలా మందికి యువీ అంటే భయం' అని యోగ్‌రాజ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు (Yuvraj Singh controversy).


'ఇక్కడ నిజమైన స్నేహాలు ఉండవు. డబ్బు, విజయం, పేరు ప్రఖ్యాతలకే విలువ ఎక్కువ. కెరీర్ ఆరంభంలో యువీ అంటే ఎంతో ఇష్టపడిన కోహ్లీ ఆ తర్వాత మారిపోయాడు. కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు యువీకి పెద్దగా అవకాశాలు కల్పించలేదు. కోహ్లీ సపోర్ట్ చేసి ఉంటే యువీ మరింత కాలం ఆడేవాడు' అని యోగ్‌రాజ్ పేర్కొన్నారు (Yograj Singh backstabber remark). అయితే గతంలోనే యువరాజ్ తన తండ్రి వ్యాఖ్యలను ఖండించాడు. ధోనీ, కోహ్లీ తనకు ఎంత సహాయం చేయాలో అంతా చేశారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి..

ముంబైకా రాజా.. రోహిత్ శర్మ కారును చుట్టుముట్టి ఫ్యాన్స్ హంగామా.. వీడియో వైరల్..

కోహ్లీ పాస్.. లండన్‌లో టెస్ట్‌కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 06 , 2025 | 08:47 AM