ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump Praises PM Modi: ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన డొనాల్డ్ ట్రంప్..

ABN, Publish Date - Oct 29 , 2025 | 03:11 PM

ఓ ప్రపంచ వేదికపై మోదీ ప్రస్తావన తెచ్చారు ట్రంప్. మోదీతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. బుధవారం సౌత్ కొరియాలోని జియోంగ్జులో జరిగిన ‘ఏషియా, పసిఫిక్ ఎకానమిక్ కార్పోరేషన్ (ఏపీఈసీ) సమిట్‌లో ట్రంప్ పాల్గొన్నారు.

Donald Trump Praises PM Modi

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంచెం కొంచెంగా దారిలో పడుతున్నారు. భారత్‌తో బిజినెస్ చేయకపోతే ఎంత నష్టం జరుగుతుందో ఆయనకు బాగా తెలిసి వస్తున్నట్లు ఉంది. అందుకే భారత ప్రధాని మోదీపై ప్రేమ కురిపిస్తున్నారు. తాజాగా, ఓ ప్రపంచ వేదికపై మోదీ ప్రస్తావన తెచ్చారు. మోదీతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. బుధవారం సౌత్ కొరియాలోని జియోంగ్జులో జరిగిన ‘ఏషియా, పసిఫిక్ ఎకానమిక్ కార్పోరేషన్ (ఏపీఈసీ) సమిట్‌లో ట్రంప్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నాకు ఇండియా మీద చాలా ప్రేమ, గౌరవం ఉన్నాయి. త్వరలో ఇండియాతో ట్రేడ్ డీల్ చేసుకోబోతున్నాము. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీతో కూడా మంచి అనుబంధం ఉంది. మోదీ చూడ్డానికి చాలా కూల్‌గా కనిపిస్తారు. కానీ, చాలా మొండివారు’ అని అన్నారు. ఇండియా, పాకిస్తాన్ యుద్ధం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ గొప్ప వీరుడంటూ పొగిడారు.

ఎక్కడికెళ్లినా అదే పాట..

డొనాల్డ్ ట్రంప్ ఏ దేశానికి వెళ్లినా కూడా భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం గురించి ప్రస్తావిస్తున్నారు. తన వల్లే రెండు దేశాలు యుద్ధాన్ని ఆపాయని చెప్పుకుంటూ ఉన్నారు. దక్షిణ కొరియా, జపాన్, కౌలాలంపూర్ పర్యటనల్లో కూడా రెండు దేశాల మధ్య యుద్ధం గురించి మాట్లాడారు. తన వల్లే ప్రపంచ వ్యాప్తంగా 8 యుద్ధాలు ఆగాయని చెప్పారు. పాకిస్తాన్ ప్రధాని, ఫీల్డ్ మార్షల్‌ను ప్రత్యేకంగా పొగుడ్తూ ఉన్నారు.

ఇవి కూడా చదవండి

భారత్‌ - చైనా చర్చలు.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి

వీటిని తిన్న వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లు తాగకూడదు.. ఎందుకంటే..

Updated Date - Oct 29 , 2025 | 03:19 PM