Death To America: యూఎస్ కార్యాలయంపై దాడి, ట్రంప్‌ను చంపుతానని బెదిరింపులు
ABN, Publish Date - May 26 , 2025 | 12:28 PM
టెల్ అవీవ్‌లోని అమెరికా మిషన్‌పై కాల్పులకు ప్రయత్నించిన 28 ఏళ్ల జోసెఫ్ న్యూమెయర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపుతానని కూడా జోసెఫ్ బెదిరింపులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ని చంపుతానని బెదిరించిన 28 ఏళ్ల జోసెఫ్ న్యూమెయర్ అరెస్ట్
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రయెల్ ప్రముఖ నగరమైన టెల్ అవీవ్‌లోని అమెరికా మిషన్‌పై కాల్పులకు ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ద్వంద్వ (యుఎస్-జర్మన్) పౌరసత్వం కల్గిన 28 ఏళ్ల జోసెఫ్ న్యూమెయర్ పై ఈ మేరకు అభియోగాలు మోపారు. జోసెఫ్ మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపుతానన్న బెదిరింపుల ఆరోపణలు కూడా ఉన్నాయని యుఎస్ అటార్నీ జనరల్ చెప్పారు.
ఒక వేళ జోసెఫ్ దోషిగా తేలితే, గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష, $250,000 వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది. న్యూమెయర్ గత నెలలో ఇజ్రాయెల్‌కు వెళ్లాడు. మే 19న అతను తన ఫేస్‌బుక్ ఖాతాలో "నేను రాయబార కార్యాలయాన్ని తగలబెట్టినప్పుడు నాతో చేరండి" అని పోస్ట్ చేశాడు.
"అమెరికాకు మరణం, అమెరికన్లకు మరణం, పశ్చిమ దేశాలకు మరణం" అని జోసెఫ్.. టెల్ అవీవ్‌లోని యుఎస్ దౌత్య మిషన్‌కు వెళ్లే ముందు మరో ఫేస్ బుక్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. యూఎస్ మిషన్ దగ్గర కాపాలాగా ఉన్న గార్డుపై జోసెఫ్ ఉమ్మివేసాడు. గార్డు అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు తప్పించుకు పారిపోయాడు. ఈ క్రమంలో అతను బ్యాగ్ కింద పడిపోయింది.
ఈ వార్తలు కూడా చదవండి..
దారుణం.. తొమ్మిది మంది అన్నాచెల్లెళ్లు మృతి..
భూమిక మృతదేహం అప్పగింతకు నిరాకరణ
For International news And Telugu News
Updated Date - May 26 , 2025 | 01:20 PM