ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bharatanatyam Debut in Beijing: భరతనాట్యంలో అరంగేట్రం చేసిన చైనా విద్యార్థిని

ABN, Publish Date - Aug 25 , 2025 | 02:53 AM

భారతీయ ప్రాచీన కళారూపమైన భరతనాట్యంలో అరంగేట్రం చేయడం ద్వారా చైనా జాతీయురాలైన 17ఏళ్ల జాంగ్‌ జియాయువాన్‌ చరిత్ర సృష్టించింది. ఈ మేరకు బీజింగ్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో...

బీజింగ్‌, ఆగస్టు 12: భారతీయ ప్రాచీన కళారూపమైన భరతనాట్యంలో ’అరంగేట్రం’ చేయడం ద్వారా చైనా జాతీయురాలైన 17ఏళ్ల జాంగ్‌ జియాయువాన్‌ చరిత్ర సృష్టించింది. ఈ మేరకు బీజింగ్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ భరతనాట్య కళాకారిణి జిన్‌ షాన్‌ షాన్‌, భారత దౌత్యవేత్తలు, పెద్దఎత్తున హాజరైన స్థానికుల ఎదుట జాంగ్‌ తన అరంగేట్ర ప్రదర్శన చేసింది. తద్వారా చైనాలోనే శిక్షణ పొంది, ఇక్కడే అరంగేట్రం చేసిన రెండో నర్తకిగా రికార్డు సృష్టించింది. గతేడాది 13 ఏళ్ల లీ ముజీ చైనాలో మొట్ట మొదటిసారిగా భరతనాట్య అరంగేట్రాన్ని ప్రదర్శించిన తొలి విద్యార్థినిగా నిలిచింది. జాంగ్‌ ఐదేళ్ల వయసులోనే భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించి, 12ఏళ్లు వచ్చేనాటికి తన గురువు జిన్‌ షాన్‌ షాన్‌ నిర్వహించే ప్రత్యేక నృత్య పాఠశాలలో చేరింది. అరంగేట్రం కోసం రోజుకు 5గంటల చొప్పున కఠిన సాధన చేసింది. ప్రదర్శన తర్వాత భారత దౌత్యవేత్త అభిషేక్‌ ఆమెను అభినందిస్తూ, అత్యంత క్లిష్టమైన భారతీయ నృత్య రూపాన్ని నేర్చుకోవడానికి తను చేసిన కృషిని ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి..

మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు

రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక

రాహుల్ యాత్రలో మళ్లీ అపశృతి

For More National News And Telugu News

Updated Date - Aug 25 , 2025 | 02:53 AM