Share News

Voter Adhikar Yatra: రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక

ABN , Publish Date - Aug 24 , 2025 | 06:50 PM

రాహుల్ యాత్రలో ప్రియాంక పాల్గొనడం ద్వారా ఓట్ల చోరీకి వ్యతిరేకంగా జరుగుతున్న యాత్రలో మహిళల మద్దతు కూడా కూడగడతారని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. కాగా, రాహుల్ గాంధీ ఆదివారంనాడు పూర్ణియా జిల్లాలో యాత్ర సాగించారు.

Voter Adhikar Yatra: రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక
Rahul gandhi with Priyanka Gandhi

పూర్ణియా: బిహార్‌ (Bihar)లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) 'ఓటర్ అధికార్ యాత్ర' (Voter Adhikar Yatra) కొనసాగుతోంది. కాంగ్రెస్ కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతూ రాహుల్ సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) ఈ యాత్రలో పాల్గోనున్నారు. సుపౌల్ (Supaul), సీతమర్హి (Sitamarhi)లో ఈనెల 26, 27 తేదీల్లో రాహుల్‌తో ప్రియాంక కలిసి పాల్గొంటారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ తెలిపారు. బిహార్‌లో హిందువులు ముఖ్యమైన పండుగగా భావించే హర్తాలికా తీజ్ (Hartalika Teej) కూడా ఈనెల 26న జరుగనుంది. వివాహిత స్త్రీలు ఈ పండుగలో భర్త దీర్ఘాయుష్షు, సౌభాగ్యం కోసం రోజంతా ఉపవాస వ్రతం పాటిస్తారు. ప్రియంక గాంధీ తన పర్యటనలో భాగంగా సీతామర్హిలోని జానకిమాత ఆలయంలో పూజల్లో పాల్గొంటారు.


రాహుల్ యాత్రలో ప్రియాంక పాల్గొనడం ద్వారా ఓట్ల చోరీకి వ్యతిరేకంగా జరుగుతున్న యాత్రలో మహిళల మద్దతు కూడా కూడగడతారని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. కాగా, రాహుల్ గాంధీ ఆదివారంనాడు పూర్ణియా జిల్లాలో యాత్ర సాగించారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్‌పై రెండు కిలోమీటర్లు యాత్ర సాగించారు. మార్గమధ్యలో జాలాగఢ్ సమీపంలోని రోడ్డుపక్కనే ఉన్న ధాబా వద్ద రాహల్ ఆగి టీ తాగుతూ స్థానికులతో ముచ్చటించారు.


బిహార్‌లో అక్టోబర్-నవంబర్ మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషన్ బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) చేపట్టడం, సవరించిన ఓటర్ల జాబితాను ప్రకటించడంపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. లక్షలాది ఓటర్లను జాబితా నుంచి తొలగించారని, పెద్ద సంఖ్యలో నకిలీ ఓటర్లను చేర్చారని, తద్వారా బీజేపీతో కలిసి ఓట్ల చోరీకి ఈసీ పాల్పడుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు ఆధారాలుంటే రాహుల్ అఫిడవిట్ సమర్పించాలని, అలా చేయకుంటే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈసీ డిమాండ్ చేసింది. అయితే రాహుల్ తన వాదనకే కట్టుబడుతూ బిహార్‌లో 'ఓటర్ అధికార్ యాత్ర' కొనసాగిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

రాహుల్‌కి ముద్దు పెట్టిన యువకుడు.. చితక్కొట్టిన సిబ్బంది

రాహుల్ యాత్రలో మళ్లీ అపశృతి

For More National News And Telugu News

Updated Date - Aug 24 , 2025 | 06:55 PM