ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rafael Jets: రఫేల్ విమానాల ఫొటోలు తీస్తూ పోలీసులకు చిక్కిన చైనీయులు.. గ్రీస్‌లో ఘటన

ABN, Publish Date - Jul 10 , 2025 | 11:23 PM

గ్రీస్ మిలిటరీ స్థావరాల్లోని రఫేల్ యుద్ధ విమానాల ఫొటోలు తీస్తున్న నలుగురు చైనీయులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా ఫొటోలను స్వాధీనం చేసుకున్నారు. చైనా నిఘా కార్యకలాపాల్లో భాగంగా ఈ ఫొటోలు తీసుకున్నారా అనే కోణంలో వారిని విచారిస్తున్నారు.

China Rafael Jets

ఇంటర్నెట్ డెస్క్: రఫేల్ ఫైటర్ జెట్లు, హెలెనిక్ ఎయిరోస్పేస్ ఇండస్ట్రీ స్థావరాల ఫొటోలు తీసేందుకు ప్రయత్నించిన నలుగురు చైనా జాతీయులు గ్రీస్‌ పోలీసులకు చిక్కారు. చైనా నిఘా కార్యకలాపాల్లో భాగంగా వీరు ఈ ఫొటోలు తీసుకున్నారా అని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

హెలెనిక్ ఎయిర్ ఫోర్సు పోలీసులు ఈ చైనీయులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో ముగ్గురు పురుషులు ఓ మహిళ ఉన్నారు. అనంతరం స్థానిక మిలిటరీ స్థావరాల్లో హైఅలర్ట్ జారీ చేశారు. చైనీయుల చర్యలు అనుమానాస్పదంగా ఉండటంతో వారిని అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. హెలెనిక్ ఎయిరోస్పేస్ ఇండస్ట్రీ స్థావరం పరిసరాల్లో నలుగురు చైనీయులు ఫొటోలు తీస్తూ కనిపించారు.

దీంతో, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. అయితే, వారు అక్కడికి కొంత దూరంలో ఉన్న వంతెనపైకి ఎక్కి ఆ పరిసరాలను ఫొటోలు తీస్తుండటంతో సిబ్బంది ఎయిర్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, అప్రమత్తమైన ఎయిర్ ఫోర్సు పోలీసులు ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. తరువాత స్థానిక పోలీసులకు అప్పగించారు.

ఆ మిలిటరీ స్థావరానికి సంబంధించిన ఫొటోలు పెద్ద మొత్తంలో వారి వద్ద లభించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో చైనా నిఘాకార్యకలాపాల్లో భాగంగా ఈ ఫొటోలు తీసి ఉంటారా అనే కోణంలో అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల భారత్, గ్రీస్ సంయుక్త మిలిటరీ, నావికాదళ విన్యాసాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనీయుల చర్యలపై గ్రీస్‌లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

అస్థికలతో అంతరిక్ష ప్రయాణం.. తిరిగొస్తుండగా..

14 దేశాలకు ట్రంప్ లేఖలు.. సుంకాలు తప్పవంటూ వార్నింగ్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 11:30 PM