Share News

Trump New Tariffs: 14 దేశాలకు ట్రంప్ లేఖలు.. సుంకాలు తప్పవంటూ వార్నింగ్

ABN , Publish Date - Jul 08 , 2025 | 04:35 PM

సుంకాల విధింపునకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 14 దేశాలకు లేఖలు రాశారు. తమ కండీషన్లకు ఒప్పుకోని దేశాలపై గరిష్ఠంగా 40 శాతం వరకూ టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు.

Trump New Tariffs: 14 దేశాలకు ట్రంప్ లేఖలు.. సుంకాలు తప్పవంటూ వార్నింగ్
Trump Tariffs

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి దిగారు. అమెరికా ఉత్పత్తుల దిగుమతులకు అడ్డంకులు తొలగించాలని పలు దేశాలను డిమాండ్ చేశారు. అమెరికాలో తయారీని పెంచాలని కూడా తేల్చి చెప్పారు. ఈ డీల్‌కు అంగీకరించకపోతే భారీ సుంకాలు తప్పవంటూ 14 దేశాలకు లేఖలు రాశారు. ఆయా దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 25 శాతం నుంచి 40 శాతం వరకూ సుంకాలను విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తమ వాణిజ్య డిమాండ్స్‌‌కు అంగీకరించని దేశాలపై ఆగస్టు 1 నుంచి సుంకాల వడ్డన ఉంటుందని తేల్చి చెప్పారు.

తన లేఖల్లో డెడ్‌లైన్ గురించి ప్రస్తావించినప్పటికీ ఈ విషయంలో మరిన్ని చర్చలకు సుముఖంగానే ఉన్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఆగస్టు 1 డెడ్‌లైన్ కచ్చితమైనదేమీ కాదని వెల్లడించారు. చర్చలకు వీలు కల్పించేలా ఈ గడువును మరింత పొడిగించేందుకు కూడా రెడీ అని అన్నారు. అమెరికా ఉత్పత్తులపై ఆంక్షలు తొలగించే దేశాలపై సుంకాలు మరింతగా తగ్గించే అవకాశం కూడా ఉందని అన్నారు. యూఎస్ కేవలం న్యాయమైన, సమతౌల్యమైన వాణిజ్యాన్ని మాత్రమే కోరుకుంటోందని చెప్పిన ట్రంప్.. తన అభీష్టానికి ఎదురెళితే మాత్రం మరింత సుంకాల వడ్డన తప్పదని కూడా హెచ్చరించారు.


ట్రంప్ లేఖలు అందుకున్న దేశాలు ఇవీ..

  • లావోస్, మియాన్మార్ - 40 శాతం

  • థాయ్‌లాండ్, కాంబోడియా- 36 శాతం

  • బంగ్లాదేశ్, సెర్బియా - 35 శాతం

  • ఇండోనేషియా - 32 శాతం

  • దక్షిణాఫ్రికా, బోస్నియా అండ్ హెర్జగోవినా - 30 శాతం

  • జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, కజఖస్థాన్, ట్యునీషియా-25 శాతం


ఈ దేశాల్లో అనేకం ఎగుమతులపై అధికంగా ఆధార పడ్డాయి. గతంలో ఈ దేశాలపై సుంకాలు కేవలం 10 శాతంగా ఉండేది. ఇక ట్రంప్ లేఖపై జపాన్ విచారం వ్యక్తం చేసింది. ఈ విషయంలో చర్చలు జరుపుతామని వెల్లడించింది. భారీ సుంకాల ప్రమాదం తప్పించేందుకు చర్చలు కొనసాగిస్తామని దక్షిణ కొరియా, మలేషియా కూడా వెల్లడించాయి. ఇదిలా ఉంటే యూకే, వియత్నాంతో అమెరికాకు డీల్ కుదిరిందని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. భారత్‌తో కూడా డీల్ దాదాపుగా ఖరారైనట్టేనని అన్నారు.

ఇవి కూడా చదవండి:

అస్థికలతో అంతరిక్ష ప్రయాణం.. తిరిగొస్తుండగా..

మస్క్‌ పూర్తిగా గాడితప్పారు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 08 , 2025 | 06:28 PM