China: కార్గో విమానంలో పాక్‌కు ఆయుధాలు... వదంతులపై మండిపడిన చైనా
ABN, Publish Date - May 12 , 2025 | 07:51 PM
చైనా 'వై-20' సైనిక రవాణా విమానం ద్వారా పాక్‌కు ఆయుధారులు చేరవేసిందంటూ కొన్ని మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. ఈ ఊహాగానాలపై చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో పీఎల్ఏ స్పష్టత ఇచ్చింది.
బీజింగ్: ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) ఉద్రిక్తతల సమయంలో పాకిస్తాన్‌కు తమ దేశ అతిపెద్ద కార్గో విమానం (Y-20 military transport aircraft) ద్వారా ఆయుధాలు సరఫరా చేసినట్టు వస్తున్న వదంతులను చైనా సైన్యం సోమవారంనాడు తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా నిరాధారమని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) పేర్కొంది. ఇలాంటి వదంతులు వ్యాప్తి చేస్తున్న వారిపై లీగల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం..
చైనా 'వై-20' సైనిక రవాణా విమానం ద్వారా పాక్‌కు ఆయుధారులు చేరవేసిందంటూ కొన్ని మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. ఈ ఊహాగానాలపై చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో పీఎల్ఏ స్పష్టత ఇచ్చింది. ఈ వదంతుల్లో నిజం లేదని పేర్కొంది. కొన్ని ఫోటోల స్క్రీన్‌షాట్లు షేర్ చేసింది. ''ఇంటర్నెట్ అనేది చట్టానికి అతీతం కాదు. మిలటరీ సంబంధించి వదంతులు సృష్టిస్తూ వాటిని వ్యాప్తి చేసే వారు చట్టపరంగా బాధ్యులవుతారు" అని హెచ్చరించింది.
స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్ఐపీఆర్ఐ) ఇటీవల ఒక రిపోర్డ్‌లో పాకిస్తాన్‌కు చైనా అతిపెద్ద ఆయుధాల సరఫరా దేశంగా ఉన్నట్టు తెలిపింది. 2020 నుంచి 2024 వరకూ పాకిస్థాన్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో 81 శాతం చైనా నుంచే వచ్చినట్టు ఆ నివేదిక పేర్కొంది. చైనా నుంచి పాక్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో జెట్ ఫైటర్లు, రాడార్లు, నేవల్ షిప్స్, సబ్‌మెరైన్లు, క్షిపణలు కూడా ఉన్నాయి. ఇరుదేశాలు జే-17 ఎయిర్‌క్రాఫ్ట్‌ను సంయుక్తంగా కూడా తయారు చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
Emmanuel Macron: కొకైన్‌తో దేశ అధ్యక్షుడు.. మీటింగ్‌లో అడ్డంగా బుక్కయ్యాడు..
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌నకు భారీ బహుమతి.. ఇంకా క్లారిటీ లేదన్న ఖతార్
Updated Date - May 12 , 2025 | 07:54 PM