Share News

Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం..

ABN , Publish Date - May 12 , 2025 | 03:50 PM

పాకిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.6 గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(NCS) ఈ విషయాన్ని వెల్లడించింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. దీని ప్రభావంతో మరోసారి భూప్రకంపనలు వచ్చే అవకాశం ..

Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం..
Earthquake in Pakistan

Pakistan Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.6 గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(NCS) ఈ విషయాన్ని వెల్లడించింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. దీని ప్రభావంతో మరోసారి భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని ఎన్‌సీఎస్ వెల్లడించింది. పాకిస్థాన్‌లో భూకంపం సంభవించిన విషయాన్ని ఎన్‌సీఎస్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ‘సోమవారం మధ్యాధ్నం 1.26 గంటలకు పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో గుర్తించడం జరిగింది.’ అని పేర్కొంది.


ప్రపంచంలోనే తరచుగా భూకంపాలు సంభవించే దేశాలలో పాకిస్థాన్ కూడా ఒకటి. ఈ దేశంలోని చాలా ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తుంటాయి. చాలా శక్తివంతమైన భూకంపాలు సంభవించే అవకాశం ఉంటుంది. పాకిస్థాన్ బౌగోళికంగా యురేషియా, భారతీయ టెక్టోనిక్ ప్లేట్స్ మధ్య విస్తరించి ఉంది. యురేషియన్ ప్లేట్ దక్షిణ అంచున బలూచిస్తాన్, గిరిజన ప్రాంతాలు, ఖైబర్ ఫంఖ్తున్ఖ్వా, గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రావిన్స్‌లు ఉన్నాయి. ఇక దక్షిణాసియాలని భారత్ ప్లేట్‌ వాయువ్య అంచున సింధ్, పంజాబ్, పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ ప్రావిన్స్‌లు ఉన్నాయి. ఈ రెండు టెక్టోనిక్ ప్లేట్స్ ఢీకొనడం వల్ల తరచూ తీవ్రమైన భూకంపాలు సంభవిస్తున్నాయని ఎన్‌సీఎస్ అధికారులు వివరించారు.


Also Read:

పీఓకేలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సక్సెస్

భారత్-పాక్ చర్చలు సాయంత్రానికి వాయిదా

రూ.3.5 లక్షలతో.. మీ కోటి రూపాయల కల ఇలా నిజం..

For More International News and Telugu News..

Updated Date - May 12 , 2025 | 03:50 PM