ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చార్లీ కర్క్‌ను ఎందుకు హత్య చేశాడంటే..

ABN, Publish Date - Sep 17 , 2025 | 12:26 PM

అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు టైలర్ రాబిన్ సన్ హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న చార్లీ కర్క్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అతడుకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

వాషింగ్టన్, సెప్టెంబర్ 17: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కర్క్‌ను హత్య చేసినట్లు అనుమానిస్తున్న టైలర్ రాబిన్‌సన్ విషయంలో కీలక విషయాలు బహిర్గతమవుతున్నాయి. ఈ హత్య అనంతరం టైలర్ రాబిన్‌సన్.. తన రూమ్‌మెట్‌కు ఫోన్ ద్వారా పలు సందేశాలు పంపాడు. అందులో తానే ఈ హత్య చేసినట్లు తెలిపాడని కోర్టులో దాఖలు చేసిన పత్రాల్లో పోలీసులు స్పష్టం చేశారు. టర్నింగ్ పాయింట్ యూఎస్ఏను చార్లీ కర్క్ స్థాపించారు. గత వారం అతడు యుటా వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా.. అతడిపై ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో చార్లీ కర్క్‌ మెడ భాగంలోకి ఒక బూల్లెట్ దూసుకుపోయింది.

దాంతో అతడు అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. అనంతరం చార్లీని ఆసుపత్రికి తరలించారు. అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా అనుమానితుడు టైలర్ రాబిన్‌సన్‌ను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని యుటా కోర్టులో హాజరు పరిచారు. కానీ కర్క్‌ను రాబిన్ సన్ ఎందుకు హత్య చేశాడనేందుకు బలమైన కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టం కాలేదు. అయితే టైలర్ రాబిన్ సన్ రాసుకున్న పుస్తకాన్ని మాత్రం కోర్టుకు పోలీసులు అందజేశారు.

చార్లీ కార్క్ ద్వేషం తనకు విసుగు పుట్టించిందని.. దానిని పరిష్కరించలేమని ఆ పుస్తకంలో టైలర్ రాబిన్ సన్ పేర్కొన్నారు. అయితే రాబిన్ సన్.. తన రూమ్‌లోని ట్రాన్స్ జెండర్ యువతితో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నాడని ఆ డైరీ ద్వారా స్పష్టమవుతోంది. అదీకాక చార్లీ కర్క్‌ను హత్య చేసేందుకు రాబిన్ సన్ దాదాపు వారం రోజుల పాటు ప్రణాళికలు వేసుకున్నాడు. అతడు రాసుకున్న డైరీ ద్వారా ఈ విషయం బహిర్గతమైంది.

ఇక చార్లీ కర్క్‌ను బయటకు తీసుకువెళ్లే అవకాశం తనకు కలిగిందని... అతడిని తాను బయటకు తీసుకు వెళ్తున్నట్లు టైలర్ రాసిన ఒక లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ హత్య అనంతరం జరిగిన చాట్‌ సైతం కోర్టుకు పోలీసులు సమర్పించారు.

ఈ హత్య అనంతరం గత గురువారం యుటాలోని సెయింట్ జార్జ్ సమీపంలో టైలర్ రాబిన్‌సన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నివాసాన్ని సైతం పోలీసులు పరిశీలించారు. ఈ సందర్భంగా అతడి నివాసంలోని తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. ఇక అతడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్య కేసులో అతడికి బలమైన శిక్ష పడే అవకాశాలున్నాయి. మరోవైపు టైలర్.. తమ విచారణకు సహకరించడం లేదన్నారు. కానీ అతడి కుటుంబ సభ్యులతోపాటు స్నేహితులు సహకరిస్తున్నారని వివరించారు.

ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసినట్లు సెనేట్ జ్యూడిషియరీ కమిటీకి ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వెల్లడించారు. టైలర్ రాబిన్ సన్ ఎవరితో మాట్లాడాడు. ఎవరెవరితో చాటింగ్ చేశాడనే విషయాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కిర్క్‌పై కాల్పులు మత బృందాలపై హింసలో భాగంగా జరిగిందని భావిస్తున్నారా అంటూ అడిగిన ప్రశ్నలకు పటేల్‌పై విధంగా సమాధానం ఇచ్చారు.

Updated Date - Sep 17 , 2025 | 12:33 PM