Canada Population Decline: కెనడా జనాభాలో తగ్గుదల.. 1946 తరువాత తొలిసారిగా..
ABN, Publish Date - Dec 18 , 2025 | 08:33 AM
చాలా కాలం తరువాత కెనడా జనాభాలో తగ్గుదల నమోదైంది. వలసలు తగ్గడంతో గత త్రైమాసికంలో కెనడా జనాభా సుమారు 76 వేల మేర పడిపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: కెనడా జనాభాలో కోత పడింది. వలసలు తగ్గిపోవడంతో గత త్రైమాసికంలో జనాభాలో 76 వేల మేర కోత పడింది. జనాభాలో వృద్ధి లేకపోగా వలసలు కూడా తగ్గడంతో జనాల సంఖ్యలో కోతపడినట్టు ప్రభుత్వం విడుదల చేసిన తాజా సెన్సెస్ గణాంకాల్లో వెల్లడైంది (Canada Population Decline).
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2020 తరువాత ఇలా త్రైమాసిక కాల వ్యవధిలో జనాభా తగ్గుదల నమోదుకావడం ఇదే తొలిసారి. తాత్కాలిక వర్క్, స్టడీ వీసాలపై వచ్చే వారి సంఖ్య తగ్గడంతో జనాభా తగ్గిందని సెన్సెస్ ఏజెన్సీ తెలిపింది. తగ్గుదల స్వల్పంగానే ఉన్నప్పటికీ 1946 తరువాత త్రైమాసికాల వారి తగ్గుదల ఈస్థాయిలో ఉండటం ఇదే తొలిసారి కావడంతో కెనడాలో ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఇతర ఐరోపా దేశాల్లాగా కెనడాలో కూడా జననాల సంఖ్య పడిపోతుంతోంది. దీంతో, ఆర్థికాభివృద్ధికి కోసం కెనడా వలసలను ప్రోత్సహించింది. అయితే, కరోనా సంక్షోభం తరువాత ప్రభుత్వ ఖజానాపై పెరిగిన భారం, జీవన వ్యయాలు పెరగడంతో వలసలపై వ్యతిరేకత పెరిగింది. 2023-25 మధ్య కాలంలో లేబర్ కొరత సమస్యకు పరిష్కారం దిశగా సుమారు 1.2 మిలియన్ మంది విదేశీయులు కెనడాకు వెళ్లారు. దీంతో, అప్పటి ప్రభుత్వ విధానాలపై విమర్శలు పెరిగాయి. వలసలు పెరగడంతో ప్రజారోగ్య వ్యవస్థలు, ఇళ్లు వంటివి తగినన్ని అందుబాటులో లేక ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో, దిద్దుబాటు చర్యలకు దిగిన ట్రూడో ప్రభుత్వం 2026, 2027 సంవత్సరాల వార్షిక వలసల టార్గెట్స్‌ను కుదించింది. ట్రూడో తరువాత అధికారంలోకి వచ్చిన ప్రధాని మార్క్ కార్నీ కూడా వలసల కట్టడి విధానాలను కొనసాగిస్తుండటంతో జనాభాలో చాలా కాలం తరువాత తగ్గుదల నమోదైంది. అయితే, దేశంలో నిపుణులు, కార్మికుల కొరత తీర్చేందుకు ప్రభుత్వం వలసలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టించింది. అనుభవజ్ఞులైన నిపుణుల అవసరం ఉన్న హెల్త్‌కేర్, పరిశోధన రంగాల్లో వలసలను ప్రోత్సహించే యోచనలో ఉంది.
ఇవీ చదవండి:
మరిన్ని ఉక్రెయిన్ భూభాగాలను లాగేసుకుంటాం: పుతిన్ వార్నింగ్
మరో 7 దేశాల పర్యాటకులపై అమెరికా నిషేధం!
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 18 , 2025 | 09:05 AM