Brazil President Lula: మోదీకి ఫోన్ చేస్తా.. ట్రంప్ ఆఫర్‌ను తోసిపుచ్చిన బ్రెజిల్ అధ్యక్షుడు
ABN, Publish Date - Aug 06 , 2025 | 12:03 PM
ఈ ఏడాది బ్రెజిల్‌లో జరుగునున్న 'కాప్' సదస్సుకు ట్రంప్‌ను ఆహ్వానిస్తారా అని అడిగినప్పుడు లుల సానుకూలంగా స్పందించారు. మర్యాదపూర్వకంగానే ట్రంప్‌ను ఆహ్వానిస్తామన్నారు.
బ్రసిలియా: సుంకాలపై ఏ సమయంలోనైనా తనకు ఫోన్ చేయవచ్చంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆఫర్‌ను బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లుల డిసిల్వా (Luiz Inacio Lula da Silva) తిరస్కరించారు. ట్రంప్‌కు బదులుగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు కాల్ చేసేందుకు ప్రాధాన్యతనిస్తానని చెప్పారు.
బ్రసిలియాలో జరిగిన ఒక కార్యక్రమంలో లుల మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడికి తాను ఫోన్ చేసేదిలేదని, ఎందుకంటే ఆయన చర్చలకు సిద్ధంగా లేరని చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం తమతో ప్రయాణించడం లేనందున ఆయనకు కూడా ఫోన్ చేసేది లేదన్నారు. తక్కిన ఎవరితోనైనా మాట్లాడతానని తెలిపారు. ఈ ఏడాది బ్రెజిల్‌లో జరుగునున్న 'కాప్' సదస్సుకు ట్రంప్‌ను ఆహ్వానిస్తారా అని అడిగినప్పుడు సానుకూలంగా స్పందించారు. మర్యాదపూర్వకంగానే ట్రంప్‌ను ఆహ్వానిస్తామన్నారు. వాతావరణం మార్పులపై ఆయన అభిప్రాయం తెలుసుకునేందుకే పిలుస్తామని చెప్పారు.
ట్రంప్ ఆఫర్
గత వారంలో వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఇరుదేశాల మధ్య సుంకాలు, ఇతర ఘర్షణలకు సంబంధించి లుల తనకు ఏ సమయంలోనైనా ఫోన్ చేయవచ్చునని చెప్పారు. దీనిపై బ్రెజిల్ ఆర్థిక మంత్రి ఫెర్నాండో కూడా అంతే సూటిగా స్పందించారు. ఇదే ఫీలింగ్‌తో తమ అధ్యక్షుడి కూడా ఉన్నారని అన్నారు. బ్రెజిల్ ఉత్పత్తులపై ట్రంప్ అత్యధికంగా 50 శాతం సుంకాలు విధించడంతో వాషింగ్టిన్, రియో డి జనేరియాల మధ్య ఇటీవల కాలంలో సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఇవి కూడా చదవండి..
రష్యాపై దూకుడు.. ట్రంప్ మళ్లీ యూటర్న్
ట్రంప్ హెచ్చరికల వేళ రష్యాలో అజిత్ డోభాల్
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 06 , 2025 | 12:07 PM