ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bangladesh Elections:షేక్‌ హసీనా స్థానం నుంచి హిందూ నేత పోటీ!

ABN, Publish Date - Dec 25 , 2025 | 04:44 PM

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో మాజీ ప్రధాని షేక్‌ హసీనా ప్రాతినిధ్యం వహించిన గోపాల్‌గంజ్‌-3 స్థానం నుంచి ఓ హిందూ నేత పోటీలో చేయనున్నారు. గోవిందా చంద్ర ప్రామాణిక్ అనే అడ్వకేట్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.

Sheikh Hasina

బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో మాజీ ప్రధాని షేక్‌ హసీనా ప్రాతినిధ్యం వహించిన గోపాల్‌గంజ్‌-3 స్థానం నుంచి ఓ హిందూ నేత పోటీలో చేయనున్నారు. గోవిందా చంద్ర ప్రామాణిక్ అనే అడ్వకేట్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు బంగ్లాదేశ్‌ (Bangladesh) రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో హసీనాకు చెందిన అవామీ లీగ్‌ పార్టీని ఎన్నికల్లో పోటీచేయకుండా అక్కడి తాత్కాలిక ప్రభుత్వం నిషేధించింది.

మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ మహమ్మద్‌ యూనస్‌ (Muhammad Yunus) నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. షేక్ హసీనా ప్రజాగ్రహానికి గురై.. గతేడాది దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. యూనస్ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అవామీ లీగ్‌పార్టీ కోల్పోయింది. మాజీ ప్రధాని ఖాలిదా జియా (Khaleda Zia) కుమారుడు, బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ తాత్కాలిక చైర్మన్‌ తారిక్‌ రెహమాన్‌ దాదాపు 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన వేళ ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.

మరోవైపు యూనస్ ప్రభుత్వంపై బంగ్లా మాజీ ప్రధాని హసీనా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బంగ్లాదేశ్–భారత్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలకు పూర్తిగా తాత్కాలిక ప్రభుత్వమే కారణమని ఆమె వ్యాఖ్యానించారు. నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం భారత్‌పై శత్రుత్వ వైఖరి ప్రదర్శిస్తూ, మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలకు రక్షణ కల్పించడంలో విఫలమవుతోందని హసీనా ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక పరిణామాలు, అందులో ఒక హిందూ వ్యక్తిని గుంపు దాడిలో హత్య చేయడం, భారత్‌లో తీవ్ర ఆందోళనను కలిగించిన సంగతి తెలిసిందే. అలానే అక్కడి తీవ్రవాద సంస్థలు భారత్‌కు చెందిన దౌత్య కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నాయి. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో షేక్ హసీనా స్థానంలో గోవిందా చంద్ర ప్రామాణిక్ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందా అని అందరిలో ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి

కుక్కలు ఎప్పుడూ బైక్‌లు, కార్ల వెంట ఎందుకు పరిగెడతాయి.. అసలు కారణమేంటి..

మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో చిలుక ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Dec 25 , 2025 | 04:44 PM