ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ashley tellis arrested US: అమెరికా రహస్యాలు చైనాకు.. కీలక అధికారి అరెస్ట్

ABN, Publish Date - Oct 15 , 2025 | 09:20 AM

భారతీయ మూలాలున్న రక్షణ రంగ వ్యూహాకర్త ఆష్లే టెల్లీస్‌ అరెస్టయ్యారు. ఆయనను ఫెడరల్ అధికారులు విచారిస్తున్నారు.

Ashley tellis

వాషింగ్టన్, అక్టోబర్ 15: విదేశాంగ విధాన నిపుణుడు, రక్షణ రంగ వ్యూహాకర్త, భారతీయ మూలాలున్న ఆష్లే టెల్లీస్‌ అమెరికా‌లో అరెస్టయ్యారు. ఆయనను ఫెడరల్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు వర్జినియాలోని యూఎస్ అటార్నీ కార్యాలయం వెల్లడించింది. అమెరికాకు చెందిన రక్షణ రహస్యాలు ఆయన కలిగి ఉండడతోపాటు చైనా అధికారులతో రహస్య సమావేశాలు జరిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేశారు. అలాగే ఆయన నివాసంలో సైతం సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో రహస్య పత్రాలను గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఆష్లే టెల్లీస్‌ రక్షణ రంగానికి చెందిన అత్యంత కీలకమైన కలిగి ఉండడం ద్వారా ఆయన నిబంధనలు అతిక్రమించారని ప్రాసిక్యూటర్స్ ఆరోపిస్తున్నారు.

ఇంకోవైపు యూఎస్ న్యాయవాది లిండ్సే హాలిగన్ పత్రిక ప్రకటన ద్వారా ఆయనపై అభియోగాలను ప్రకటించారు. ఆష్లే డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్‌లో కాంట్రాక్టర్‌గా విధులు నిర్వర్తించారు. 2001 నుంచి ఆయన ఈ విభాగంలో పని చేస్తున్నారు. ఆ క్రమంలో దేశ రక్షణకు సంబంధించిన సమాచారాన్ని చట్టవిరుద్ధంగా ఆయన కలిగి ఉన్నారు.

అయితే ఇటీవల తన కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగిని.. రహస్య పత్రాలకు సంబంధించిన ప్రింట్లు ఇవ్వాలని కోరినట్లు ఫెడరల్ అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగా అమెరికా ఎయిర్ ఫోర్స్‌లోని సైనిక సామర్థ్యాలకు సంబంధించిన పత్రాలను ప్రింట్ చేసినట్లు వారు వెల్లడించారు.

అలాగే పలుమార్లు చైనా అధికారులతో ఆష్లే సమావేశమయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా వారు ఇచ్చిన బహుమతులు సైతం ఆష్లే తీసుకున్నారని ఫెడరల్ అధికారులు స్ఫస్టం చేశారు. ఈ కేసులో ఆయన దోషిగా తేలితే కనుక.. పదేళ్ల జైలు శిక్షతోపాటు రెండు లక్షలకు పైగా డాలర్లను ఆయనకు జరిమానాగా విధించే అవకాశం ఉంది.

Updated Date - Oct 15 , 2025 | 09:36 AM