ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Russia: రష్యాలో మళ్లీ భూకంపం.. ఈ రోజు ఉదయం 6.0 తీవ్రతతో ప్రకంపనలు

ABN, Publish Date - Aug 05 , 2025 | 09:46 AM

రష్యాను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఇటీవల రష్యా కమ్చాట్కా తీరంలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత ఏకంగా 8.8గా నమోదైంది. తాజాగా మంగళవారం ఉదయం అదే కమ్చాట్కా తీరంలో మరోసారి భూకంపం సంభవించింది.

Russia Earthquake

మాస్కో: వరుస భూకంపాలు (Earthquake) రష్యా(Russia)ను వణికిస్తున్నాయి. ఇటీవల రష్యా కమ్చాట్కా తీరంలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత ఏకంగా 8.8గా నమోదైంది. తాజాగా మంగళవారం ఉదయం అదే కమ్చాట్కా తీరంలో (Kamchatka Earthquake) మరోసారి భూకంపం సంభవించింది. ఈసారి భూకంప తీవ్రత 6.0గా నమోదైంది. అయితే ఈ భూకంపం వల్ల కలిగిన ఆస్తి, ప్రాణ నష్టం గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

జులై 30వ తేదీన ఇదే తీరంలో భారీ భూకంపం సంభవించింది. ఆ భారీ భూకంపం కారణంగా రష్యా, జపాన్, ఉత్తర పసిఫిక్ తీరంలోని పలు ప్రాంతాలను సునామీ తాకింది. కాగా, ఆ భూకంపం తర్వాత కూడా కమ్చాట్కా తీరంలో భూప్రకంపనలు కొనసాగాయి. 8.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం తర్వాతి నుంచి దాదాపు 16 గంటలపాటు రష్యా సమీపంలో 4.4 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో దాదాపు 125 సార్లు ప్రకంపనలు నమెదైనట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే డేటా ప్రకారం తెలుస్తోంది.

ఆదివారం కూడా కురిల్ దీవులలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే అదే కమ్చాట్కా ద్వీపకల్పంలోని క్రాషెన్నినికోవ్ అగ్నిపర్వతం శనివారం అర్ధరాత్రి బద్దలైంది. ఇటీవల సంభవించిన భారీ భూకంపం కారణంగా దాదాపు 600 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ అగిపర్వతం బద్దలైనట్టు రష్యా అధికారులు వెల్లడించారు. ఈ అగ్నిపర్వతం బద్దలైన కారణంగా దాదాపు ఆరు వేల మీటర్ల మేర బూడిద ఎగిసిపడినట్టు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

శ్రీకృష్ణుడే మొదటి రాయబారి.. సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

గల్వాన్ వ్యాలీ వివాదంలో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు వార్నింగ్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 05 , 2025 | 11:58 AM