ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: ఢిల్లీ పేలుళ్ల బాధ్యులను చట్టం ముందుకు తెస్తాం.. మోదీ

ABN, Publish Date - Nov 11 , 2025 | 03:55 PM

ఢిల్లీ పేలుళ్లలో పలువురు మృతులకు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల వాంగ్‌చుక్ సంతాపం తెలిపారు. చాంగ్లిమిథాంగ్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మృతుల కు సంతాపం తెలుపుతూ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.

PM Modi

థింపూ: ఢిల్లీ పేలుళ్లకు (Delhi Blasts) పాల్పడిన కుట్రదారులను విడిచిపెట్టేది లేదని, దర్యాప్తు ఏజెన్సీలు ఆమూలాగ్రం కేసును దర్యాప్తు చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. భూటాన్‌ (Bhutan)లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం రాత్రి జరిగిన భారీ పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

'బరువెక్కిన హృదయంలో ఈరోజు ఇక్కడకు వచ్చాను. నిన్న ఢిల్లీలో జరిగిన భయానక ఘటన ప్రతి ఒక్కరని విషాదంలో ముంచేసింది' అని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఆవేదనను తాను అర్ధం చేసుకోగలనని, యావద్దేశ ప్రజలు వారికి అండగా నిలుస్తారని చెప్పారు. ఘటనకు సంబంధించిన వివరాలపై అన్ని ఏజెన్సీలతోనూ ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నట్టు తెలిపారు. కుట్ర వెనుక ఎవరు ఉన్నప్పటికీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని, వారిని చట్టం ముందుకు తీసుకువస్తామని స్పష్టం చేశారు.

ఢిల్లీ పేలుళ్లలో పలువురు మృతులకు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల వాంగ్‌చుక్ సంతాపం తెలిపారు. చాంగ్లిమిథాంగ్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మృతులకు సంతాపం తెలుపుతూ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. వేలాది మంది భూటాన్ ప్రజల పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

ఢిల్లీ పేలుళ్ల ఘటన.. కీలక వ్యక్తి ఫొటో

వెలుగులోకి..

ఢిల్లీ పేలుడు ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 11 , 2025 | 03:59 PM