ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Afghanistan Earthquake: అఫ్గాన్‌లో 1,400కు పెరిగిన మృతుల సంఖ్య

ABN, Publish Date - Sep 03 , 2025 | 03:28 AM

అఫ్గానిస్థాన్‌లో సంభవించిన భారీ భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య మంగళవారం నాటికి 1,400కు చేరుకుంది....

జలాలాబాద్‌, సెప్టెంబరు 2: అఫ్గానిస్థాన్‌లో సంభవించిన భారీ భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య మంగళవారం నాటికి 1,400కు చేరుకుంది. మూడువేల మందికిపైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని తాలిబాన్‌ ప్రభుత్వ అఽధికార ప్రతినిధి ఎక్స్‌ ద్వారా తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. మారుమూల కొండ ప్రాంతాలకు సహాయ బృందాలు వెళ్లే వీలు లేకపోవడంతో అక్కడి పరిస్థితి తెలియరావడం లేదు. ఇళ్లన్నీ మట్టి, కలపతో నిర్మించినవి కావడంతో భూకంపం కారణంగా అవన్నీ నేలమట్టమయ్యాయి. ఆదివారం అర్థరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో తప్పించుకునే అవకాశం లేకపోయింది. తాలిబన్‌ ప్రభుత్వాన్ని ఒక రష్యా మినహా మిగతా దేశాలేవీ గుర్తించకపోవడంతో అంతర్జాతీయ సాయం అంతగా అందడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ..!

ఏపీ మహేష్ బ్యాంక్‌కు షాక్ ఇచ్చిన ఈడీ

For More National News And Telugu News

Updated Date - Sep 03 , 2025 | 03:28 AM