AP Mahesh Cooperative Bank: ఏపీ మహేష్ బ్యాంక్‌కు షాక్ ఇచ్చిన ఈడీ
ABN , Publish Date - Sep 02 , 2025 | 07:02 PM
ఏపీ మహేష్ కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేగం పెంచింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 02: ఏపీ మహేష్ కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేగం పెంచింది. అందులో భాగంగా ఈ అర్బన్ బ్యాంక్‌కు సంబంధించిన రూ. 1. 1 కోట్లు విలువైన రెండు స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అదిబట్లలోని ఈ రెండు స్థిరాస్తులను అటాచ్ చేసింది. అయితే.. మాజీ ఎమ్‌డీ, సీఈవో ఉమేష్ చంద్ ఆసవా కుమారుడు రోహిత్ ఆసవా పేరుపై ఈ ఆస్తులు ఉన్నట్లు ఈడీ గుర్తించింది.
ఇక రుణాల కోసం 2 నుంచి 4 శాతం మేర కమీషన్ వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అలా వసూలు చేసిన ఈ అక్రమ నగదుతో ఈ ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ.. తన దర్యాప్తులో గుర్తించింది. అలాగే ఈ బ్యాంక్ మాజీ చైర్మన్ రమేశ్ కుమార్ బంగ్, ఉమేష్ చంద్ ఆసవాతోపాటు పురుషోత్తం దాస్ మందానపై ఇప్పటికే పలు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. అక్రమ ఆస్తుల కొనుగోలు ద్వారా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి.. లోతైన విచారణ జరుపుతున్నట్లు ఈడీ మంగళవారం వెల్లడించింది.