ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Opens Fire on National Guard Near White House: వైట్‌ హౌస్‌ వద్ద కాల్పుల కలకలం

ABN, Publish Date - Nov 28 , 2025 | 03:59 AM

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌ్‌సకు అతి సమీపంలో నేషనల్‌ గార్డులపై ఓ అఫ్గానిస్థాన్‌ జాతీయుడు కాల్పులు జరపటం కలకలం సృష్టించింది....

  • నేషనల్‌ గార్డులపై అఫ్గాన్‌ జాతీయుడి కాల్పులు

  • మహిళసహా ఇద్దరు గార్డులకు తీవ్ర గాయాలు

వాషింగ్టన్‌, నవంబరు 27: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌ్‌సకు అతి సమీపంలో నేషనల్‌ గార్డులపై ఓ అఫ్గానిస్థాన్‌ జాతీయుడు కాల్పులు జరపటం కలకలం సృష్టించింది. దేశ రాజధాని వాషింగ్టన్‌ డీసీలోని ఫరాగట్‌ వెస్ట్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో రహమానుల్లా లకన్‌వాల్‌అనే వ్యక్తి బుధవారం మఽధ్యాహ్నం(స్థానిక కాలమానం) 2.15 గంటల సమయంలో కాల్పులు జరిపాడు. వీధుల్లో గస్తీ నిర్వహిస్తున్న వెస్ట్‌ వర్జీనియా నేషనల్‌ గార్డు దళ సభ్యులపై అతి సమీపం నుంచి కాల్పులు జరపటంతో ఇద్దరు గార్డులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. గార్డుల ఎదురుకాల్పుల్లో రహమానుల్లా కూడా గాయపడ్డాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలో గురువారం థ్యాంక్స్‌ గివింగ్‌ డే వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రజలంతా ఆ ఉత్సాహంలో ఉండగా, ఒకరోజు ముందు కాల్పులు జరగటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఇది క్రూరమైన దాడి

కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా స్పందించారు. థ్యాంక్స్‌ గివింగ్‌ డే వేడుకల్లో పాల్గొనేందుకు ఫ్లోరిడా వెళ్లిన ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. గత అధ్యక్షుడు జో బైడెన్‌ ఇమిగ్రేషన్‌ విధానాల వల్లే దేశంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘వాషింగ్టన్‌ డీసీలో విధుల్లో ఉన్న నేషనల్‌ గార్డు సభ్యులపై వైట్‌హౌ్‌సకు కొన్ని అడుగుల దూరంలోనే చోటుచేసుకున్న కాల్పుల ఘటన అత్యంత క్రూరమైన చర్య. ఇది కచ్చితంగా ఉగ్రవాద దాడే. భూమిపై అఫ్గానిస్థాన్‌ నరకద్వారంగా మారింది.’ అని అన్నారు. కాగా, కాల్పులు జరిపిన రహమానుల్లా లకన్‌వాల్‌కు గతంలో అఫ్గానిస్థాన్‌లో సైనిక శిక్షణ ఇచ్చింది అమెరికా నిఘా వర్గాలేనని తేలింది. అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా తన బలగాలను వెనక్కు తీసుకున్న సమయంలో నాటి అధ్యక్షుడు బైడెన్‌ అమలుచేసిన ‘ఆపరేషన్‌ అలైజ్‌ వెల్‌కం’(భాగస్వాములకు స్వాగతం)లో భాగంగా 2021, సెప్టెంబర్‌ 8న అతడు అమెరికా చేరుకున్నాడు. ఇప్పటికే విదేశీయుల రాకపై ఆంక్షలు విధించిన ట్రంప్‌.. తాజా ఘటన నేపథ్యంలో అఫ్గానిస్థాన్‌తో సంబంధాలను పూర్తిగా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. ఆ దేశస్తుల ఇమిగ్రేషన్‌ దరఖాస్తుల పరిశీలనను నిరవధికంగా నిలిపేస్తున్నట్లు అమెరికా సిటిజన్‌షిప్‌, హోంల్యాండ్‌ సెక్యూరిటీ ప్రకటించింది.

Updated Date - Nov 28 , 2025 | 04:00 AM