Earthquake Strikes Philippines: ఫిలిప్పిన్స్‌లో భారీ భూప్రకంపనలు.. సునామీ హెచ్చరికలు జారీ..
ABN, Publish Date - Oct 10 , 2025 | 10:19 AM
శుక్రవారం ఉదయం ఫిలిప్పిన్స్ దేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. మిండనావోలోని కోస్టల్ ఏరియాలోనూ వరసగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
ఫిలిప్పిన్స్‌లో భారీ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూ ప్రకంపనల తీవ్రత రిక్టార్ స్కేలుపై 7.4 మాగ్నిట్యూడ్‌గా నమోదు అయింది. శుక్రవారం ఉదయం ఫిలిప్పిన్స్ దేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. మిండనావోలోని కోస్టల్ ఏరియాలోనూ వరసగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వాటి తీవ్రత రిక్టార్ స్కేలుపై 2.6 మాగ్నిట్యూడ్, 4.9 మాగ్నిట్యూడ్‌గా నమోదు అయింది.
భూప్రకంపనలకు ముందు ‘ది పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్’ ఫిలిప్పిన్స్‌కు సునామీ హెచ్చరికలను జారీ చేసింది. 10 అడుగుల మేర అలలు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది. అయితే, భూప్రకంపనలు రావటంతో సునామీ హెచ్చరికలను ఎత్తివేసింది. ప్రస్తుతం భూప్రకంపనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వీడియోలో.. భూప్రకంనల కారణంగా రోడ్డుపై ఉన్న వాహనాలు, స్థంభాలపై ఉన్న తీగలు వేగంగా ఊగుతూ ఉన్నాయి. జనం వాహనాలు ముందుకు పోనివ్వకుండా రోడ్డుపైనే నిలిపేశారు.
ఫిలిప్పిన్స్‌లో భూప్రకంపనల కారణంగా ఇండోనేషియాలోని తలౌద్ ఐలాండ్స్, నార్త్ సులవేసిలలో మైనర్ సునామీలు వచ్చాయి. మైనార్ సునామీల కారణంగా అలలు 3.5 సెంటీ మీటర్ల నుంచి 17 సెంటీ మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి. ఈ విషయాలను ఇండోనేషియా ఎర్త్‌క్వాక్ అండ్ సునామీ సెంటర్ అధికారికంగా వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
ఈమె డ్రైవింగ్ స్కిల్స్‌కు అవార్డు ఇచ్చేయవచ్చు..
ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు.. ఉరేసుకుని..
Updated Date - Oct 10 , 2025 | 10:49 AM