Hyderabad: ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు.. ఉరేసుకుని..
ABN , Publish Date - Oct 10 , 2025 | 09:40 AM
ప్రేమ పేరుతో ఓ వ్యక్తి వేధింపులు భరించలేక డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ రఘుబాబు తెలిపిన వివరాల ప్రకారం.. లాలాపేట్ సాయిబాబా ఆలయం సమీపంలో ఉంటున్న ప్రమోద్‌కుమార్ విశ్రాంతి రైల్వే ఉద్యోగి.
- డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: ప్రేమ పేరుతో ఓ వ్యక్తి వేధింపులు భరించలేక డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్(Lalaguda Police Station) పరిధిలో జరిగింది. సీఐ రఘుబాబు తెలిపిన వివరాల ప్రకారం.. లాలాపేట్ సాయిబాబా ఆలయం సమీపంలో ఉంటున్న ప్రమోద్‌కుమార్ విశ్రాంతి రైల్వే ఉద్యోగి. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె మౌలిక (19) తార్నాకలోని రైల్వే డిగ్రీ కాలేజీలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
తార్నాక సమీపంలోని మాణికేశ్వర్ నగర్(Manikeshwar Nagar)కు చెందిన అంబాజీ కొన్ని నెలల క్రితం రైల్వే డిగ్రీ కాలేజీలో వాలీబాల్ కోచ్‌గా జాయిన్ అయ్యాడు. ఈ క్రమంలో మౌలికను కొద్దిరోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని పోలీసులు, స్నేహితులు తెలిపారు. యువతి తీవ్ర మనస్తాపంతో బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

లాలాగూడ పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కాగా మృతురాలి సెల్‌ఫోన్‌లో డేటా పూర్తిగా డిలీట్ చేసి ఉందని, ఆ డేటాను రిట్రీవ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వేధింపులకు పాల్పడిన అంబాజీ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం కాన్వాయ్ అంబులెన్స్‌కు ఇన్సూరెన్స్ మరిచారు
భార్య డబ్బులు ఇవ్వలేదని చెరువులో దూకిన భర్త
Read Latest Telangana News and National News