Share News

Viral Video Goes Around: ఈమె డ్రైవింగ్ స్కిల్స్‌కు అవార్డు ఇచ్చేయవచ్చు..

ABN , Publish Date - Oct 10 , 2025 | 09:55 AM

ఆమెకు స్కూటీని ఎలా రివర్స్ చేయాలో అర్థం కాలేదు. చాలా సేపు ప్రయత్నించింది. ఒకానొక సమయంలో స్కూటీ నుంచి కిందపడబోయింది. ఆటో వ్యక్తి, మరో మహిళ ఎన్ని సూచనలు చేసినా ఆమె వల్ల కాలేదు.

Viral Video Goes Around: ఈమె డ్రైవింగ్ స్కిల్స్‌కు అవార్డు ఇచ్చేయవచ్చు..
Viral Video Goes Around

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. జనం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సోషల్ మీడియానే ఆశ్రయిస్తున్నారు. అందుకే వింతగా, కొత్తగా అనిపించిన వీడియోలను వైరల్ చేసిపడేస్తున్నారు. తాజాగా, ఓ మహిళ స్కూటీ డ్రైవింగ్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ మహిళ షాపు ముందర స్కూటీ పార్క్ చేసి షాపులోకి వెళ్లింది. పని అయిపోయిన తర్వాత తిరిగి వచ్చింది. స్కూటీని వెనక్కు తిప్పి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది.


అయితే, ఆమెకు స్కూటీని ఎలా రివర్స్ చేయాలో అర్థం కాలేదు. చాలా సేపు ప్రయత్నించింది. ఒకానొక సమయంలో స్కూటీ నుంచి కిందపడబోయింది. ఆటో వ్యక్తి, మరో మహిళ ఎన్ని సూచనలు చేసినా ఆమె వల్ల కాలేదు. స్కూటీని ముందుకు, వెనక్కు తిప్పుతూనే ఉంది. ఆమె డ్రైవింగ్ స్కిల్స్ చూసి ఆటో డ్రైవర్‌కు చిరాకు వేసింది. ఆమెపై అసహనం వ్యక్తం చేశాడు. చాలా సేపటి ప్రయత్నం తర్వాత ఆమె స్కూటీని వెనక్కు తీసుకెళ్లింది. కానీ, రివర్స్ మాత్రం చేయలేకపోయింది. అప్పుడే వెనకాలినుంచి ఓ కారు వచ్చింది.


కారునుంచి ఎలా తప్పుకోవాలో కూడా ఆమెకు అర్థం కాలేదు. మొత్తానికి స్కూటీని రోడ్డుకు అడ్డంగా పెట్టేసింది. ఆమె కారణంగా కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఈమె డ్రైవింగ్ స్కిల్స్ చూస్తే మతిపోతుంది. ఇలా కూడా డ్రైవ్ చేస్తారా?’..‘ఈ వీడియో ఆర్టీఓ అధికారులు చూస్తే బుర్రలు బద్ధలు కొట్టుకుంటారు. ఆమెకెలా డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి అని’..‘ఆమెకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా?’..‘ఆమెను బైక్ రేసింగ్‌కు పంపాలి. కప్పులు గెలుచుకొస్తుంది’అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

బరువు తగ్గాలనుకుంటున్నారా? గోధుమ రోటి కంటే ఈ రోటి బెస్ట్

ప్రియురాలితో దొరికిన భర్త.. రోడ్డుపై రచ్చ రచ్చ చేసిన భార్య..

Updated Date - Oct 10 , 2025 | 09:57 AM