Fierce Road Fight Erupts: ప్రియురాలితో దొరికిన భర్త.. రోడ్డుపై రచ్చ రచ్చ చేసిన భార్య..
ABN , Publish Date - Oct 10 , 2025 | 08:18 AM
ఆ వ్యక్తి తన ప్రియురాలితో నర్వాల్ మోద్ ఏరియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాడు. పని మీద నర్వాల్ మోద్ వచ్చిన భార్య వారిని చూసింది. వెంటనే భర్తతో గొడవకు దిగింది.
ప్రియురాలితో రోడ్డుపై చక్కర్లు కొడుతున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. నడిరోడ్డుపై భర్త, అతడి ప్రియురాలితో గొడవకు దిగింది. భర్త ప్రియురాలిని పొట్టు పొట్టుకొట్టింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో గురువారం చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. కాన్పూర్‌కు చెందిన ఓ వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన యువతితో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం అతడి భార్యకు తెలిసింది. ఇద్దరి మధ్యా గతకొంతకాలంగా గొడవలు నడుస్తూ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో గురువారం ఆ వ్యక్తి తన ప్రియురాలితో నర్వాల్ మోద్ ఏరియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాడు. పని మీద నర్వాల్ మోద్ వచ్చిన భార్య వారిని చూసింది. వెంటనే భర్తతో గొడవకు దిగింది. ఆ గొడవ అటు తిరిగి, ఇటు తిరిగి భార్య, ప్రియురాలి గొడవగా మారింది. ఇద్దరూ నడిరోడ్డుపై పొట్టుపొట్టు కొట్టుకుంటూ ఉన్నారు. రోడ్డుపై ఉన్న జనం సినిమా చూస్తున్నట్లు చూస్తూ ఉండిపోయారు. కొద్దిసేపటి తర్వాత భర్త కలుగజేసుకుని గొడవ ఆపాడు. భార్యకు సర్దిచెప్పి ఇంటికి పంపాడు.
ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు బాగా ఎక్కువైపోయాయి. భార్యాభర్తల బంధం అంటే బూతులా మారిపోయింది. ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూనే ఉన్నారు’..‘పాపం ఆ భార్య ఎంత నరకం అనుభవిస్తూ ఉందో. పెళ్లయిన తర్వాత ఇలాంటి తప్పులు ఎందుకు చేస్తారో’..‘చుట్టూ ఉన్న జనం టికెట్ లేకుండా సినిమా చూస్తున్నట్లుగా ఫీలవుతున్నారు’ అని కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
సర్జరీ జరుగుతుండగా విషాదం.. ప్రముఖ నటుడు మృతి
జంతు ప్రపంచంలో భీకరపోరు .. తల్లీకూతుళ్ల యుద్ధం