Salman Khans Co Star: సర్జరీ జరుగుతుండగా విషాదం.. ప్రముఖ నటుడు మృతి
ABN , Publish Date - Oct 10 , 2025 | 07:41 AM
ఆ సర్జరీ గంటలో అయిపోతుంది. అదే రోజు ఇంటికి కూడా వెళ్లవచ్చు. అయితే, డాక్టర్లు సర్జరీ చేస్తుండగా ఊహించని విషాదం చోటుచేసుకుంది. వరిందర్‌కు కార్డియాక్ అరెస్ట్ వచ్చింది.
పంజాబీ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, బాడీబిల్డర్ వరిందర్ ఘుమన్ మరణించారు. సర్జరీ సమయంలో గుండెపోటు రావటంతో 41 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. పలు జాతీయ మీడియా సంస్థల కథనం ప్రకారం.. వరిందర్ గత కొంత కాలంగా బైసెప్ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే అమృత్‌సర్‌లోని ఫోర్టిస్ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. వరిందర్‌ను పరీక్షించిన వైద్యులు సర్జరీ చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే నిన్న (గురువారం) సర్జరీ చేయించుకోవటానికి ఆయన ఫోర్టిస్ వెళ్లారు. ఆ సర్జరీ గంటలో అయిపోతుందని.. అదే రోజు ఇంటికి కూడా వెళ్లవచ్చని వైద్యులు తెలిపారు. అయితే, డాక్టర్లు సర్జరీ చేస్తుండగా ఊహించని విషాదం చోటుచేసుకుంది. సర్జరీ మద్యలో కార్డియాక్ అరెస్ట్ రావడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు..
వరిందర్ ప్రొఫెషల్ బాడీ బిల్డర్ అని తెలిసింది. దీంతోపాటూ 2009లో మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్నారు. అదే సంవత్సరం జరిగిన మిస్టర్ ఏషియాలో రెండో స్థానం సాధించారు. అంతేకాకుడా.. ఐఎఫ్‌బీబీ ప్రో కార్డు పొందిన తొలి భారతీయుడిగా వరిందర్ రికార్డు సృష్టించారు. బాడీ బిల్డర్స్ సంఘంలో ఆయనకంటూ ఓ ప్రత్యేక గౌరవం ఉంది.
వరిందర్ చిత్ర పరిశ్రమలోనూ తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు పంజాబీ, హిందీ సినిమాల్లో నటించారు. 2012లో విడుదలైన కబడ్డీ వన్స్ ఎగైన్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. 2014లో రోయర్ (టైగర్స్ ఆఫ్ సుందర్‌బన్స్), 2019లో విడుదలైన మర్జవాన్ సినిమాల్లో నటించారు. ఆయన నటించిన చివరి చిత్రం టైగర్ 3. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించారు. వరిందర్ మరణంపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
జంతు ప్రపంచంలో భీకరపోరు .. తల్లీకూతుళ్ల యుద్ధం
మధ్యంతర ఉత్తర్వులు వెబ్‌సైట్‌లో పెట్టండి