Stealth Fighters: పాకిస్థాన్‌తో చైనా తాజా చేష్టలు మనకెలాంటి ముప్పు?
ABN, Publish Date - Jun 20 , 2025 | 04:15 PM
వీలు చిక్కితే చాలు భారత్ మీద ముప్పేట దాడి చేయాలని చూసే పాక్‌కు సాధ్యమైనంత శక్తిని, ఊతాన్ని ఇస్తూనే ఉంటుంది చైనా. ఇప్పటికే ఇది ఎన్నోమార్లు రుజువైనప్పటికీ ఇంకా అదే తీరున ప్రవర్తిస్తూ ఉంది. తాజాగా చేసిన పని..
ఇంటర్నెట్ డెస్క్: ఎంత పాజిటివ్‌గా ముందుకెళ్లినా ఎప్పటికప్పుడు చైనా ఎందుకో భారత్‌పై సాధ్యమైనంత ఒత్తిడి పెంచడానికే చూస్తుంటుంది. ప్రాచీన కాలం నుంచే కాక, మొన్నటి కేరళ తీరం సమీపంలోని అరేబియా సముద్రంలో అగ్నిప్రమాదానికి గురైన చైనా సరుకు రవాణా నౌక వరకూ స్నేహాస్తాన్నే చాచింది ఇండియా. చైనాకు చెందిన సదరు సరకు రవాణా నౌక అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటే భారత నేవీ సిబ్బంది ప్రాణాలకు తెగించి 14 మంది చైనా దేశస్థులను కాపాడారు. దీనికి చైనా ప్రభుత్వం థ్యాంక్స్ కూడా చెప్పిందనుకోండి.. కానీ కుక్కతోక వంకరన్న చందాన భారత్‌కు ఎప్పుడూ పక్కలో బల్లెంలా బిహేవ్ చేస్తుంటుంది చైనా. మనమంటే గిట్టని పాకిస్థాన్‌కు అండదండలందిస్తూ ప్రతిసారీ తన వక్ర బుద్ధిని చాటుతుంది.
వీలు చిక్కితే చాలు భారత్ మీద ముప్పేట దాడి చేయాలని చూసే పాక్‌కు సాధ్యమైనంత శక్తిని, ఊతాన్ని ఇస్తూనే ఉంటుంది చైనా. ఇప్పటికే ఇది ఎన్నోమార్లు రుజువైనప్పటికీ ఇంకా అదే తీరున ప్రవర్తిస్తూ ఉంది. ఇటీవలి పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రతిదాడికి దిగిన పాకిస్థాన్.. చైనా, టర్కీ దేశాలు అందించిన డ్రోన్లు, క్షిపణులతో భారత్ ముందు తోకజాడించే ప్రయత్నం చేసింది. ఇక ఇప్పుడు పాకిస్తాన్‌కు 40 షెన్యాంగ్ J-35 ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్‌లను సరఫరా చేయబోతోంది చైనా. J-35 ప్రవేశంతో పాకిస్తాన్ స్టెల్త్ టెక్నాలజీని నిర్వహిస్తున్న అతి తక్కువ దేశాల సరసన చేరుతుంది. ఇది భారత్‌కు కొంత ఇబ్బందికర అంశమే అవుతుంది. 'పాకిస్తాన్ ఈ జెట్లను అందుకోవడంలో ఆశ్చర్యం లేదు ఎందుకంటే, పాక్ నామినేట్ చేసిన ఫైటర్ పైలట్ల బృందం గత ఆరు నెలలకు పైగా చైనాలో ఉంది' అని ఒక అధికారి వెల్లడించారు.
ఇక, భారత్ పరిస్థితికి వస్తే, ప్రస్తుతం భారత్ అమ్ములపొదిలో ఎటువంటి స్టెల్త్ ఫైటర్‌లు లేవు. భారత వైమానిక దళం (IAF), స్వదేశీ ఐదవ తరం స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్ - అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA)ను ప్రవేశపెట్టడానికి ఇంకా కనీసం ఒక దశాబ్ద కాలం పట్టే అవకాశం ఉంది. అధికారిక అంచనాల ప్రకారం 2035 నాటికి AMCA ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లోకి చేరనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యలు.. స్పందించిన కాంగ్రెస్ పార్టీ
ఘోర రోడ్డుప్రమాదం.. తొమ్మిది మంది మృతి
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jun 20 , 2025 | 04:59 PM