Fatty liver: ముఖంపై ఈ 5 లక్షణాలు.. ఫ్యాటీ లివర్‌కు సంకేతాలు..
ABN, Publish Date - May 27 , 2025 | 07:31 AM
Fatty liver Symptoms: ఈ మధ్య ఫ్యాటీ లివర్ అనే వ్యాధి గురించి ఎక్కువగా వినిపిస్తోంది. డయాబెటిస్, హై బీపీ, ఊబకాయం, అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్ వంటి తీవ్ర సమస్యలకు దారితీసే ఈ వ్యాధి లక్షణాలను ముందే పసిగట్టడం కష్టం. కానీ, ముఖంపై కనిపించే ఈ 5 సంకేతాల ఆధారంగా ఫ్యాటీ లివర్ సమస్య వస్తుందో.. రాదో.. నిర్ధారించుకోవచ్చు.
Fatty liver Symptoms On Face: ఆల్కహాల్ సేవించే వారికే ఎక్కువగా కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయని అంతా భావిస్తుంటారు. కానీ, ఫ్యాటీ లివర్ అనే ప్రమాదకరమైన కాలేయ సమస్యల్లో రెండు రకాలుంటాయి. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD), ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (AFLD). హెపాటిక్ స్టీటోసిస్ అని పిలిచే ఫ్యాటీ లివర్ కాలేయ కణాలలో కొవ్వు అతిగా పేరుకుపోవడం వల్ల వస్తుంది. అత్యంత తీవ్ర వ్యాధులకు దారితీసే ఈ వ్యాధి ప్రారంభ లక్షణాలను గుర్తించడం చాలా కష్టం. ఒకవేళ కనిపించినా సాధారణ సమస్యే అనుకుని తోసిపుచ్చే వారే ఎక్కువ. కానీ, ఫ్యాటీ లివర్ వ్యాధిని ముందే కనుక్కోగలిగితే ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గం దొరుకుతుంది. ముఖంపై కనిపించే ఈ లక్షణాలు ఆధారంగా ఫ్యాటీ లివర్ సమస్యను ఎవరికి వారే సొంతంగా నిర్ధారించుకోవచ్చు. తద్వారా త్వరగా చికిత్స పొందే అవకాశం లభిస్తుంది.
డార్క్ సర్కిల్స్
తగినంతసేపు రోజూ నిద్రపోతున్నప్పటికీ కళ్ల చుట్టు నల్లటి వలయాలు ఏర్పడుతుంటే కాలేయంపై ఒత్తిడి పెరిగిందని అర్థం. కాలేయం శరీరంలోని విషకారకాలను సమర్ధవంతంగా ఫిల్టర్ చేయలేనప్పుడు అలసట పెరుగుతుంది. రక్తంలో హానికర కారకాలు పెరిగి నాణ్యత కొరవడుతుంది. ఈ రెండు కారణాల వల్ల కళ్ళ కింద నలుపు రంగు రావడం లేదా ఉబ్బడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
పసుపు రంగు చర్మం (తేలికపాటి కామెర్లు)
చర్మం లేదా కళ్ళలో తెల్లటి భాగం పసుపు రంగులోకి మారడం అనేది కామెర్ల ప్రారంభ సంకేతం కావచ్చు. కాలేయం బిలిరుబిన్‌ను సరిగ్గా ప్రాసెస్ చేయనప్పుడు ఇలా జరుగుతుంది.
ఉబ్బడం
కాలేయ పనితీరు దెబ్బతినడం వల్ల హానికర ద్రవాల కారణంగా కళ్ళు, బుగ్గల చుట్టూ వాపు వస్తుంది. కాలేయం ద్రవాల సమతుల్యత లోపిస్తే శరీరంలో ఎలక్ట్రోలైట్‌ల నిర్వహణ కష్టతరమై ముఖం, కళ్లు ఉబ్బడానికి దారితీస్తుంది.
పాలిపోయిన లేదా నిస్తేజమైన రంగు
ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారిలో శరీరంలో వ్యర్థాలు పూర్తిగా బయటకు పోవు. ఇవన్నీ రక్తప్రవాహంలో కలిసిపోతాయి. ఫలితంగా ముఖం పాలిపోతుంది. నీరసమైన లేదా నిస్తేజమైన రంగులో కనిపిస్తుంది. చర్మంలో తేజస్సు లేకపోతే కాలేయ పనితీరు దెబ్బతిని రక్త ప్రసరణ సరిగా లేదని అర్థం.
మొటిమలు లేదా జిడ్డుగల చర్మం
మీ కాలేయం ఎక్కువగా పనిచేయాల్సి వచ్చినపుడు హార్మోన్ల నియంత్రణలో ఇబ్బందులు రావచ్చు. ఇది జిడ్డుగల చర్మం, మొటిమలకు దారితీస్తుంది. ముఖ్యంగా పెద్దవారిలో ఈ హార్మోన్ల అసమతుల్యత ఎక్కువ. టాక్సిన్స్ పేరుకుపోవడంతో పాటు తరచుగా లేదా తీవ్రమైన మొటిమలకు దారితీస్తుంది.
Also Read:
సైంటిస్టులు అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..
సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..
For More Health News and Telugu News..
Updated Date - May 27 , 2025 | 11:11 AM