Blood pressure: రక్తపోటు.. అవయవాలకు చేటు
ABN, Publish Date - May 17 , 2025 | 08:25 AM
రక్తపోటు.. ఇప్పుడున్న ఉరుకులు, పరుగుల జీవితం.., ఆహార కల్తీలతో ప్రతిఒక్కరూ హైపర్ టెన్షన్‌తో ఇబ్బంది పడుతున్నారు. అయితే.. దీన్ని ముందస్తు గుర్తింపుతో ప్రమాదాన్ని నివారించుకునే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అసలీ రక్తపోటు రావడానికి గల కారణాలేంటీ.. వచ్చాక దాన్ని ఎలా నియత్రించుకోవాలన్న దానిగురించి తెలుసుకుందాం..
- ముందస్తు గుర్తింపుతో ప్రమాద నివారణ
- నేడు వరల్డ్ హైపర్ టెన్షన్ డే
హైదరాబాద్: మానవాళికి అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్) ప్రమాదకరం. ఇదో సైలెంట్ కిల్లర్. దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు లేకుండా ఇది గుండె, బ్రెయిన్, కిడ్నీ(Heart, brain, kidney)లకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు రెగ్యులర్‌గా బీపీ చెక్‌పలు చేయడం చాలా ముఖ్యం. భారతదేశంలో దాదాపు 22కోట్ల మంది హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నారు. అయితే, 50 శాతం మందికి ఈ సమస్య ఉందనేదే తెలియకపోవడం ఆందోళకరమైన విషయం.
ఈ వార్తను కూడా చదవండి: Morning Tips: ఉదయం ఏ టైంలో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిదో తెలుసా..
హైపర్ టెన్షన్ అంటే...
రక్తనాళాల్లో రక్తం వేగంగా ప్రవహించి అధిక ఒత్తిడి పెరగడం వల్ల వచ్చే సమస్యే హై బీపీ. సాధారణంగా 140/90ఎంఎంహెచ్‌జీ కంటే ఎక్కువ బీపీ ఉన్నట్లయితే హైపర్ టెన్షన్‌గా పరిగణిస్తారు.
- రీడింగ్ 140/90 ఎంఎంహెచ్‌జీ ఉంటే తేలికపాటి హైపర్ టెన్షన్
- 140/90 నుంచి 159/99ఎంఎంహెచ్‌జీ మధ్య ఉంటే స్టేజ్-1 హైపర్ టెన్షన్
-160/100 ఎంఎంహెచ్‌జీ కంటే ఎక్కువైతే స్టేజ్-2 హైపర్ టెన్షన్
-180/110ఎంఎంహెచ్‌జీ కంటే ఎక్కువైతే హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీ అంటారు. దీనికి అత్యవసరంగా చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది.
హైపర్ టెన్షన్ రెండు రకాలు
- ప్రైమరీ హైపర్ టెన్షన్: ఇది వయస్సు పెరగడం, జీవనశైలి అలవాటు (అనారోగ్యకరమైన ఆహారం, వ్యాయామం లోపం, ఒత్తిడి)తో క్రమంగా వృద్ధి చెందుతుంది.
- సెకండరీ హైపర్ టెన్షన్: ఇది మూత్రపిండాల వ్యాధులు, హార్మోన్ వ్యత్యాసాలు, కొన్ని మందుల వాడకం లేదా స్లీప్ ఆఫ్నియా వంటి ఆరోగ్య సమస్యల కారణంగా వస్తుంది.
ప్రారంభ దశలో లక్షణాలు లేకపోయినా తీవ్రమైన లేదా నియంత్రించని రక్తపోటు వల్ల తలనొప్పి, తల తిరగడం వంటివి వస్తాయి. చూపు మబ్బుగా కనిపించడం, తీవ్రంగా అలసట చెందడం, చాతిలో నొప్పి, గుండె చప్పుళ్లు, అసమానంగా ఉండడం, శ్వాసలో ఇబ్బంది వంటి సంకేతాలు కనబడవచ్చు. ఇవి గుర్తించి వైద్యసాయం తీసుకోవడం చాలా ముఖ్యం. ఔషదాలతోపాటు గుండెకు మేలైన జీవనశైలిని అనుసరించడం కూడా ఎంతో అవసరం.
వ్యాయామం తప్పనిసరి
హై బీపీని నివారించేందుకు రోజుకు 5గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. నిత్యం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలు, పౌష్టిక ధాన్యాలను చేర్చాలి. మద్యం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం, యోగా వంటివి చేయాలి. 30 ఏళ్ల వయస్సు పైబడిన ప్రతి ఒక్కరూ తమ బీపీని పరీక్షించుకోవాలి. దీనిని ముందస్తుగా గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తమను తాము రక్షించుకోవచ్చు.
డాక్టర్ మురళీకృష్ణ, సీనియర్ కన్సల్టెంట్
న్యూరాలజిస్ట్, కేర్ ఆస్పత్రి, మలక్‌పేట
ఈ వార్తలు కూడా చదవండి.
Gold And Silver Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..
Variety Recipes: నోరూరించే రాగి రుచులు
Gachibowli: రేవంత్ కక్కుర్తి వల్లే ప్రకృతి విధ్వంసం: వివేకానంద
సురేఖ తెగించి కమీషన్ మంత్రుల పేర్లు చెప్పాలి
భారత వైమానిక రక్షణ దళంలో తెలుగువాడు
Read Latest Telangana News and National News
Updated Date - May 17 , 2025 | 08:25 AM